iPhone 17 Air: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ మనోడే.. అబిదుర్ చౌదరి దెబ్బకు యాపిల్‌ కంపెనీ షేక్!

ఆపిల్ ఈవెంట్‌లో ఆవిష్కరించబడిన కొత్త ఐఫోన్ ఎయిర్, దాని డిజైన్‌‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అల్ట్రా-స్లిమ్ ఫోన్‌ను పరిచయం చేసినప్పుడు తెరపై కనిపించిన పేరు అబిదుర్ చౌదరి. అతను ప్రవాసభారతీయుడని బయటకు రావడంతో అది ఇండియాకే గౌరవంగా నిలిచింది.

New Update
Abidur Chowdhury

ఆపిల్ ఈవెంట్‌లో ఆవిష్కరించబడిన కొత్త ఐఫోన్ ఎయిర్, దాని డిజైన్‌‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అల్ట్రా-స్లిమ్ ఫోన్‌ను పరిచయం చేసినప్పుడు తెరపై కనిపించిన పేరు అబిదుర్ చౌదరి. అయితే, అతను నేరుగా కెమెరా ముందు కనిపించకుండా, కేవలం తన గొంతుతో మాత్రమే ఐఫోన్ ఎయిర్ డిజైన్ గురించి వివరించడం ఆసక్తిని రేకెత్తించింది. దీంతో అబిదుర్ చౌదరి ఎవరు అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపారు. విషయం ఎంటంటే అతను ప్రవాసభారతీయుడు.

అబిదుర్ చౌదరి లండన్‌లో పుట్టి పెరిగారు. ఆయన లౌగ్‌బరో యూనివర్సిటీ నుంచి ప్రొడక్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఇందులో 2016లో రెడ్ డాట్ డిజైన్ అవార్డుతో పాటు జేమ్స్ డైసన్ ఫౌండేషన్ బర్సరీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత కేంబ్రిడ్జ్ కన్సల్టెంట్స్, కర్వెంటా వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేశారు. అనంతరం లండన్‌లోని లేయర్ అనే డిజైన్ స్టూడియోలో పనిచేశారు. 2018-2019 మధ్యకాలంలో తన సొంత కన్సల్టెన్సీ "అబిదుర్ చౌదరి డిజైన్" ను నడిపారు.

జనవరి 2019లో అబిదుర్ చౌదరి ఆపిల్‌లో ఇండస్ట్రియల్ డిజైనర్‌గా చేరారు. అప్పటి నుంచి ఆపిల్ సంస్థలో అనేక వినూత్న ఉత్పత్తుల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐఫోన్ ఎయిర్ ప్రాజెక్ట్‌లో ఆయన ముఖ్య పాత్ర పోషించారని తెలుస్తోంది. అందుకే ఆపిల్ సంస్థ ఆయనకు ఈ కొత్త ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత అప్పగించింది.

ఐఫోన్ ఎయిర్
ఆపిల్ ఇప్పటివరకు తయారు చేసిన ఫోన్లలో ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్ననిది. చౌదరి మాట్లాడుతూ, ఐఫోన్‌ ఫ్యూచర్‌లో ఓ భాగంలా తయారు చేయాలనేదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఈ ఫోన్‌లో కెమెరా, చిప్‌సెట్, ఇతర భాగాలను అమర్చడానికి కష్టపడి పనిచేశామని, మిగిలిన స్థలాన్ని బ్యాటరీ కోసం ఉపయోగించుకున్నామని ఆయన వివరించారు. ఈ వివరాలు ఆయన నైపుణ్యాన్ని, ఆయన కృషిని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం అబిదుర్ చౌదరి శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు