NANO BANANA AI: నానో బనానా ట్రెండ్.. తెలంగాణ యువకుడికి సైబర్ వల.. రూ.70వేలు మాయం
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో సైబర్ కేటుగాళ్ల వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. నానో బనానా మాదిరి ఉన్న ఇమేజ్ ఎడిటర్ యాప్ డౌన్లోడ్ చేశాడు. అందులో తన ఫొటో పెట్టి 3డిలోకి మార్చుకున్నాడు. తర్వాత అకౌంట్లో ఉన్న రూ.70వేలు మాయమయ్యాయి.