Mobile Offers: AI ఫీచర్లు, కర్వ్డ్ డిస్‌ప్లేతో కొత్త ఫోన్ అదరింది మచ్చా.. ధర వెరీ చీప్..!

ఐటెల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ సూపర్ 26 అల్ట్రాను 6000mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని ధర ప్రారంభ ధర సుమారు రూ.15,000గా నిర్ణయించారు.

New Update
Itel Super 26 Ultra

Itel Super 26 Ultra

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐటెల్(iTel) ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో Itel Super 26 Ultraను విడుదల చేసింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరకు తీసుకొచ్చింది. ఇది 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో Unisoc T7300 ప్రాసెసర్‌ అందించారు. ఈ Itel Super 26 Ultra స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన ఫీచర్లు అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 18 W ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీతో వస్తుంది.

Also Read :  ఐఫోన్ 16 కంటే 17లో ఏ ఫీచర్లు మారాయో తెలుసా? లిస్ట్ ఇదే..!

Itel Super 26 Ultra Price & Offer

Itel Super 26 Ultra స్మార్ట్‌ఫోన్ 8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 14,900గా ఉంది. అలాగే 8GB Ram+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 15,900 గా ఉంది. ఇది నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 

Also Read :  ఇదెక్కడి మాస్ రా మావా.. 50MP, 7000 mAh బ్యాటరీతో OPPO కొత్త ఫోన్ అదుర్స్..!

Itel Super 26 Ultra Specs

Itel Super 26 Ultra స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ అందించారు. దీనికి 6nm Unisoc T7300 ప్రాసెసర్ ఉంది. Itel Super 26 Ultra డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. అందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇది ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు అందించారు. ఇది Itel AI అసిస్టెంట్ Solaని కూడా కలిగి ఉంది. Itel Super 26 Ultra ఫోన్ 18 W ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 

ఇదిలా ఉంటే ఇటీవల Itel A90 లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. 3 GB RAM, 64 GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,399గా ఉంది. అలాగే 4 GB ర్యామ్+ 64 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 6,899గా కంపెనీ నిర్ణయించింది. ఇది స్పేస్ టైటానియం, అరోరా బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉంది. 

Advertisment
తాజా కథనాలు