/rtv/media/media_files/2025/07/01/moto-g96-5g-smartphone-2025-07-01-20-17-36.jpg)
Moto G96 5G smartphone
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Moto త్వరలో తన లైనప్‌లో ఉన్న మరో సూపర్ మొబైల్‌ను లాంచ్ చేయబోతుంది. Moto G96 5G మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ వచ్చే వారం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించింది.
Also Read : అది బొద్దింక కాదు.. క్లారిటీ ఇచ్చిన హోంమంత్రి అనిత
Moto G96 5G Launch Date
Moto G96 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. Moto G96 5G ఫోన్ జూలై 9న దేశంలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది.
[Exclusive] moto is launching the moto G96 5G in India on July 9th, 12PM.
— Mukul Sharma (@stufflistings) June 30, 2025
The phone will be the successor to the moto G85 5G with some noteworthy upgrades and will be specific to India it seems.
Will come with several segment-leading specs:
- Segment's first 144Hz Curved pOLED… pic.twitter.com/GBOLeF3k0V
Also Read : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఎప్పటి నుంచో తెలుసా?
Moto G96 5G స్మార్ట్‌ఫోన్ ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, కాట్లేయా ఆర్చిడ్, గ్రీనర్ పాశ్చర్స్ కలర్‌లలో అందుబాటులోకి వస్తుంది. Moto G96 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 10-బిట్ 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేతో వస్తుంది.
దీని గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి 1,600 నిట్‌లుగా ఉంటుంది. Moto G96 5G డిజైన్ దాదాపు Moto G85ని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5,500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 12 GB RAM + 256 GB స్టోరేజ్ ఉంటుంది. ఇది Android 15 ఆధారంగా Hello UIలో రన్ అవుతుంది. అయితే దీని ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read : RAILONE APP: రైల్వే సూపర్ యాప్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Also Read : Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? - షాకింగ్ వీడియోస్
tech-news-telugu | telugu tech news | tech-news