/rtv/media/media_files/JmJ7fhAzlVbHCr23Xx7M.jpg)
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. అందువల్ల కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. కొంచెం వేచి ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Redmi Note 14 SE 5G
కొత్త Redmi Note 14 SE 5G స్మార్ట్‌ఫోన్ జూలై 28న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7025 అల్ట్రా ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 5,110mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 16GB RAMతో వస్తుంది. ఫోటో, వీడియో షూట్ కోసం 50MP కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.
Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
Moto G86 Power 5G
Moto G86 Power 5G మొబైల్ జూలై 30న విడుదల కానుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 6,720mAh బ్యాటరీ ఉంటుంది. 50MP+50MP OIS Sony LYT600 వెనుక కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది.
Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
Vivo T4R 5G
కొత్త Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ జూలై 31న లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 12GB RAMతో వస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 5700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 MP కెమెరా సెటప్ ఉంటుంది.