Cobra: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

తాజాగా బిహార్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడాది వయసున్న బాలుడు ఏకంగా కోబ్రానే కొరికేశాడు. దీంతో ఆ పాము అక్కడిక్కడే చనిపోయింది. బెట్టాహ జిల్లాలోని వెస్ట్‌ చాంపరన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
One-year-old bites cobra in Bihar, boy survives, snake dies

One-year-old bites cobra in Bihar, boy survives, snake dies

పాము కాటుకు బలై మనుషులు మరణించిన ఘటనలు చాలానే జరిగాయి. అయితే తాజాగా బిహార్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఏడాది వయసున్న బాలుడు ఏకంగా కోబ్రానే కొరికేశాడు. దీంతో ఆ పాము అక్కడిక్కడే చనిపోయింది. బెట్టాహ జిల్లాలోని వెస్ట్‌ చాంపరన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లో ఆ బుడ్డోడు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నాగుపాము వచ్చింది. దాన్ని ఆ బాలుడు ఆట వస్తువుగా అనుకున్నాడు. 

Also Read: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి

Also Read :  భూమిలాంటి మరో గ్రహం.. కుప్పలుతెప్పలుగా ఏలియల్స్!

One Year Old Bites Cobra

ఆ పామును బాలుడు గట్టిగా పట్టుకున్నాడు. నోట్లో పెట్టుకొని కోరికి పారేశాడు. దీంతో ఆ పాము అక్కడిక్కడే చనిపోయింది. ఆ తర్వాత బాలుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ పిల్లాడికి పాము విషం ఎక్కలేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బాలుడిని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని చెప్పారు. డాక్టర్ల సూచనల మేరకు వారు అక్కడే ఉంచారు. 

Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

Also Read :  స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ

bihar | snake-bite | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు