Indian Army: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. వీటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరిస్తామని చెబుతోంది.

New Update
indian Army

Indian Army

ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధాల శకం నడుస్తోంది. ఎప్పుడు ఎవరు ఎవరి మీద దండెత్తుతారో తెలియని పరిస్థితి. దీని కోసం ప్రతీ దేశం అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి.  మొన్ననే పాక్ తో చిన్నపాటి యుద్ధం చేసింది భారత్. భవిష్యత్తులో మరోసారి ఈ పరిస్థితి రాదనడానికి అస్సలు లేదు. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా రెండు వైపుల నుంచీ భారత్ కు ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. అందుకే ఇండియా తన సైన్యాన్ని పటిష్టం చేసుకుంటోంది. దీని కోసం అత్యాధునిక ఆయుధాలను, పటిష్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.

రుద్ర బ్రిగేడ్స్, భైరవ్ కమాండో బెటాలియన్స్..

పాక్, చైనా సరిహద్దుల్లో కొత్త దళాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది భారత ఆర్మీ. ఇందులో భాగంగా రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్లు, భైరవ్ కమాండో బెటాలియన్ లను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తోంది. దీంతో పాటూ 11.5 లక్షల బలమైన సైన్యం 'శక్తిబాన్' ఆర్టిలరీ రెజిమెంట్‌లతో పాటు, ప్రత్యేక 'దివ్యస్త్ర' నిఘాను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ సామర్థ్యం కలిగిన మందుగుండు సామాగ్రిని కూరుస్తోంది. ప్రస్తుతం అంతా డ్రోన్ యుద్ధం నడుస్తోంది. అందుకే భారత ఆర్మీ కూడా తన బెటాలియన్ ను డ్రోన్ ప్లాటూన్ లతో సన్నద్ధం చేస్తోంది.  ఇది భారత ఆర్మీని మరింత బలోపేతం చేస్తోందని జనరల్ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు. దీంతో ప్రపంచ శక్తివంతమైన సైన్యంగా భారత ఆర్మీ మారుతుందని తెలిపారు. 

రుద్ర యూనిట్లో ఆల్‌ ఆఫ్‌ బ్రిగేడ్‌కు శుక్రవారం ఆమోదం తెలిపానని ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. దీని కింద పదాతి, యాంత్రిక దళాలతోపాటు ట్యాంకు యూనిట్లు, శతఘ్నులు, ప్రత్యేక బలగాలు, మానవ రహిత వైమానిక యూనిట్లు ఒకే చోట ఉంటాయి. ఫలితంగా రవాణా, పోరాట మద్దతుకు ఉపయుక్తంగా ఉంటాయి. దీంతోపాటు ప్రత్యేక దాడుల దళం.. భైరవ్‌ లైట్‌ కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ఇది సరిహద్దుల్లో శత్రువును విస్మయపరిచే దాడులు చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన వివరించారు. 

Advertisment
తాజా కథనాలు