BIG BREAKING: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. 

New Update
haridwar

Stampede At Manasa Devi Temple

హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉదయం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గుడి దగ్గర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది భక్తులు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక పోలీసులు, పరిపాలనా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. 

Also Read :  ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Also Read :  తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌‌తో 65 మంది విద్యార్థులు..!

Also Read :  ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

గుడి మెట్లలో కరెంట్..

ప్రాథమిక సమాచారం ప్రకారం మానసాదేవి ఆలయం మెట్ల మీద ఈ ఘటన జరిగింది. మెట్లలో విద్యుత్ ప్రవాహం ఉందని అనుమానిస్తున్నారు. దానివలనే భక్తుల్లో తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని గర్హ్వాల్ డీసీ వినయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. తాను స్థానిక పరిపాలనతో దీని గురించి మాట్లాడుతున్నానని..పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.  

Also Read:  Indian Army: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా

today-latest-news-in-telugu

Advertisment
తాజా కథనాలు