/rtv/media/media_files/2025/04/30/kdfAWFFRlAK60Ds5TxX6.jpg)
tv offers
ప్రముఖ టీవీల తయారీ సంస్థ థామ్సన్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీ ‘థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ QLED’ టీవీని విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ మూడు మోడళ్లలో వచ్చింది. అందులో 50-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాల QLED 4k డిస్ప్లేలలు ఉన్నాయి. థామ్సన్ QLED టీవీ మెటాలిక్‌తో కూడిన బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ఈ థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ QLED TV ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
Thomson Phoenix Series QLED TV Price
Thomson Phoenix Series QLED TV సిరీస్ ధర విషయానికొస్తే.. QLED TV 50QAI1015 మోడల్ ధర రూ. 26,999గా ఉంది. అదే సమయంలో 55QAI1025 మోడల్ ధర రూ. 30,999 కాగా.. 65QAI1035 మోడల్ ధర రూ. 43,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీల సేల్ మే 2, 2025 నుండి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. వీటిపై బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. యాక్సస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సక్షన్లపై రూ.1000 తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు రూ.5,400 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
Also Read: 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
Thomson Phoenix Series QLED TV Features
థామ్సన్ ఫీనిక్స్ సిరీస్ టీవీలు QLED 4k డిస్ప్లేలతో వస్తాయి. ఇవి HDR 10, డాల్బీ డిజిటల్ ప్లస్, ట్రూసరౌండ్‌తో డాల్బీ అట్మోస్‌కు మద్దతును కలిగి ఉంటాయి. ఈ థామ్సన్ QLED టీవీ మెటాలిక్‌తో కూడిన బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ టీవీలు 2GB RAM తో పాటు 16GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి.
Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!
అదే సమయంలో మాలి-G312 GPU తో ARM కార్టెక్స్ A554 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటాయి. సౌండ్ అవుట్‌పుట్ విషయానికొస్తే.. 50 అంగుళాల టీవీలో 50 వాట్ల 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే 55, 65 అంగుళాల టీవీలలో 60 వాట్ల 4 స్పీకర్లు ఉంటాయి. స్మార్ట్ AI ఫీచర్లలో AI PQ చిప్‌సెట్, AI స్మూత్ మోషన్ (60Hz), అనేక పిక్చర్, సౌండ్ మోడ్‌లు ఉన్నాయి.
Also Read:దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!
ఈ ఫీనిక్స్ సిరీస్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, ఆపిల్ టీవీ, వూట్, జీ5, సోనీ ఎల్ఐవి, గూగుల్ ప్లే స్టోర్‌తో సహా 10,000 కి పైగా యాప్‌లు, గేమ్‌లను సపోర్ట్ చేస్తాయి. కనెక్టవిటీలో.. డ్యూయల్-బ్యాండ్ 2.4 + 5 GHz Wi-Fi, బ్లూటూత్ 5.0, 3 HDMI పోర్ట్‌లు (ARC, CEC), 2 USB పోర్ట్‌లు, Google TV, Chromecast, AirPlay వంటివి ఉన్నాయి.
tech-news | telugu tech news | tech-news-telugu | tv offers | smart-tv-offer | latest-telugu-news | telugu-news