BIG BREAKING: దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!

కేంద్ర కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించింది.   రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం  విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మీడియాకు తెలిపారు.  

New Update
ashwini vaishnaw caste

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం బుధవారం పెద్ద నిర్ణయాన్ని ప్రకటించింది. రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అనంతరం ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.  కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..  కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వాములు కుల గణనను పదే పదే రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని, గత UPA ప్రభుత్వాలు కుల గణనను నిర్వహించడంలో విఫలమయ్యాయని, కానీ సర్వేలు నిర్వహించాయని కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వైష్ణవ్ అన్నారు. 1947 నుండి కుల గణన జరగలేదన్నారు. 

1947 నుండి కుల గణన లేదు

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ వైష్ణవ్ మాట్లాడుతూ, "2010లో, దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు కుల గణన అంశాన్ని మంత్రివర్గంలో పరిగణనలోకి తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ఒక బృందం ఏర్పడింది.  అనేక పార్టీలు దీనిని సిఫార్సు చేశాయి. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన కాకుండా కుల సర్వే నిర్వహించింది. కాంగ్రెస్,ఇండియా కూటమి భాగస్వాములు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నారని దీనివలన అర్థం చేసుకోవచ్చు." అని అన్నారు.  

కాగా ఇప్పటికే బీహార్,తెలంగాణ రాష్ట్రాలు కులగణనను పూర్తి చేశాయి. లోక్ సభ ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ సైతం దేశంలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ మంత్రివర్గ సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన మొదటి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు