/rtv/media/media_files/2025/04/30/hnV6FtzCQHYzWiW20h0K.jpg)
India's most wanted terrorist Hafiz Saeed'
పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రిసెస్టెన్స్ ఫ్రంట్ (TRF) తీవ్రవాదులే అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి మాత్రం లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హఫీజ్‌కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అతడు పాకిస్థాన్‌లోని ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగానే ఉన్నట్లు సమాచారం.
Also Read: కేంద్రం సంచలనం.. పహల్గాం ఉగ్రదాడి వీడియో విడుదల !
వాస్తవానికి ఉగ్రనాయకులు ఎవరికీ తెలియకుండా రహస్య ప్రదేశాల్లో ఉంటారు. ఆ ప్రాంతం నుంచే తమ ఉగ్రదాడులకు సంబంధించి ఆదేశాలిస్తుంటారు. కానీ హఫీజ్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. అతడు లాహోర్‌లోని జోరమ్ తౌమ్ అనే రద్దీ ప్రాంతంలో సామాన్య పౌరులతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. హఫీజ్ ఇంటి దగ్గర పాక్ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ ఇంట్లో హఫీజ్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇంటిముందు ఓ ప్రైవేటు పార్క్, పక్కన మసీదు, మదర్సా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటి కింద ఓ బంకర్ కూడా ఉన్నట్లు సమాచారం.
అయితే హఫీజ్ గత కొన్నిరోజులుగా పాకిస్థాన్‌లో బహరంగంగా తిరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. కానీ పాక్ ప్రభుత్వం మాత్రం వీటిని ఖండిస్తోంది. ఉగ్ర సంస్థకు నిధులు అందించినందుకు అతడికి 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని.. ఇంకా అతడు జైల్లోనే ఉన్నాడని చెబుతోంది. 2019లో హఫీజ్ అరెస్టయ్యినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ మధ్య హఫీజ్ అనుచరులు, లష్కరే ఉగ్రవాదుల హత్యలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడికి పాకిస్థాన్ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. అతడి ఇంటినే సబ్‌జైలుగా మార్చినట్లు కూడా ప్రచారం జరిగింది.
Also Read: పాక్ తో యుద్ధం.. భారత్ మరో సంచలన నిర్ణయం!
2008 నవంబర్ 26న ముంబయిలో తాజ్ హోటల్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇతర ఉగ్రదాడుల్లో కూడా హఫీజ్ సయీద్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్ మోస్ట్ వాంటెట్ టెర్రరెస్ట్ లిస్ట్‌లో కూడా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్టును ప్రకటించింది.
telugu-news | rtv-news | Pahalgam attack | national-news