CM Siddaramaiah : 'పాకిస్తాన్‌ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!

పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

New Update
Siddaramaiah calls pro-Pakistan slogan

Siddaramaiah calls pro-Pakistan slogan

పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం అన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం అవసరం లేదని చెప్పిన సీఎం వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మంగళూరులో స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

" అతను పాకిస్తాన్ జిందాబాద్ నినాదం చేసి ఉంటే అది తప్పు, అది ఎవరైనా సరే. దీనిపై  విచారణ ఇంకా కొనసాగుతోంది, కేసు నమోదు అయింది.. విచారణ కొనసాగుతోంది. నివేదిక వస్తే ఎవరిపై ఎలాంటి చర్య తీసుకోవాలో స్పష్టంగా తెలుస్తుంది" అని  సీఎం సిద్ధరామయ్య విలేకరులతో అన్నారు.  కాగా ఏప్రిల్ 27న మంగళూరు శివార్లలోని కుదుపు గ్రామంలోని భత్రా కల్లూర్టి ఆలయం సమీపంలో కర్రలతో దాడి జరిగింది.  క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశాడని ఆరోపిస్తూ ఒక గుంపు అతన్ని కొట్టి చంపినట్లు సమాచారం. దాదాపు 20 మందిని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు హోంమంత్రి జి. పరమేశ్వర వెల్లడించారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిని పక్కన పెట్టే ప్రశ్నే లేదని వెల్లడించారు.  

సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

పాక్‌తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని ఇటీవల సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి ఉండటంతో పాటు ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమే కారణమని ఆరోపించారు. కశ్మీర్‌లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు. పహల్గామ్‌లో పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అలాంటిది ఇక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉండాలని  సీఎం తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం.. ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా వైఫల్యమే కారణమన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు ఏం చేసినా కూడా చనిపోయిన వారి ప్రాణాలు తిరిగి రావన్నారు. అయితే సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉండకుండా.. యుద్ధానికి సిద్ధంగా లేమని చెప్పడం ఏంటని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు