/rtv/media/media_files/2025/10/11/samsung-galaxy-m17-5g-2025-10-11-08-24-00.jpg)
Samsung Galaxy M17 5G
శాంసంగ్ కంపెనీ ఇండియాలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy M17 5G ని విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. 'నో షేక్ కెమెరా' ఫీచర్‌ను ఇచ్చింది. ఈ ఫోన్ చూడటానికి స్లీక్ డిజైన్‌లో ఉంటుంది. మరి ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Flipkart Mobile Offers: వాయమ్మో ఇవేం ఆఫర్లరా బాబు.. ఐఫోన్, శాంసంగ్, వివో, మోటో ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు..!
ప్రీమియం ఫీచర్లతో..
ఈ ఫోన్‌ను శాంసంగ్ మూడు వేర్వేరు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని బేసిక్ వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.12,499గా ఉంది. ఇక మిడ్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.13,999 కాగా, అత్యధిక హై ఎండ్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.15,499గా ఉంది. దీనిపై బ్యాంక్ డిస్కౌంట్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మొబైల్ అక్టోబర్ 13వ తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది. Samsung Galaxy M17 5G ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా నాజూకుగా, ప్రీమియం డిజైన్‌తో ఉంటుంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో 6.7 అంగుళాల AMOLED స్క్రీన్ ను ఇచ్చారు. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అనే బలమైన గ్లాస్ రక్షణ ఉంది. దీనికి FH+ రిజల్యూషన్, 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా ఉంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా చూస్తారు. ఇది శాంసంగ్ సొంత Exynos 1330 6nm చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ వేగవంతమైన 5G కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి.
Samsung M17 5G India Launch:
— Jason C. (@_TheJasonC) October 10, 2025
Display:
• 6.7-inch AMOLED
• 90Hz refresh rate
• 1,000-nit peak brightness.
• Corning Gorilla Glass Victus
Hardware:
• Exynos 1330
• 4GB | 6GB | 8GB Ram
• 128GB Storage
Cameras:
• 50MP main sensor with OIS
• 5MP ultrawide camera
• 2MP… pic.twitter.com/qsGTQjG7Uw
కెమెరా, బ్యాటరీ ఫీచర్లు
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంద. దీనిలో 50MP OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రధాన సెన్సార్ ఉంది. OIS ఫీచర్ వల్ల ఫోటోలు, వీడియోలు కదలకుండా, స్పష్టంగా వస్తాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది. ఈ కెమెరాలో AI ఫీచర్లు, శాంసంగ్ ప్రత్యేక కెమెరా ఫిల్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్‌లో 5000 mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని ఇచ్చారు. దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అదనంగా ఈ ఫోన్ IP54 రేటింగ్ ఉంది. దీనివల్ల ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ ఇస్తుంది. బడ్జెట్‌లో బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: Diwali Amazon Offers: దీపావళికి అమెజాన్ పిచ్చెక్కించే ఆఫర్.. కేవలం రూ.500లకే కత్తిలాంటి ఇయర్ బడ్స్!