/rtv/media/media_files/2025/10/10/fastrack-fpods-fx101-2025-10-10-09-40-31.jpg)
Fastrack Fpods FX101
దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్‌లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌పై పిచ్చెక్కించే ఆఫర్స్ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ డీల్స్ కావాలని కొందరు చూస్తుంటారు. అలాంటి వారికి ఈ సేల్ బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే చాలా మంది పాటలు వినడం కోసం మంచి ఇయర్ బడ్స్ తీసుకోవాలని చూస్తుంటారు. అది కూడా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఇయర్ బడ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Flipkart Mobile Offers: వాయమ్మో ఇవేం ఆఫర్లరా బాబు.. ఐఫోన్, శాంసంగ్, వివో, మోటో ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు..!
ఫాస్ట్రాక్ ఎఫ్‌పాడ్స్ ఎఫ్‌ఎక్స్101
ఈ ఫాస్ట్రాక్ ఇయర్ బడ్స్ ప్రస్తుతం అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఏకంగా 86% తగ్గింపుతో కేవలం రూ. 499 కే కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ వీటికి ఉంది. ఇందులో 10mm డీప్ బాస్ స్పీకర్లు ఉంటాయి. అలాగే దీనికి క్వాడ్ మైక్ సపోర్ట్ కూడా ఉంది. ఈ బడ్స్ 40 గంటల ప్లే టైమ్ అందిస్తాయి. అంతేకాక వీటిని చాలా వేగంగా ఛార్జ్ చేసే నైట్రో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ బడ్స్ IPX6 రేటింగ్‌తో వస్తాయి. వాటర్, చెమటకు కూడా ఇవి తట్టుకుంటాయి.
మివి డ్యుయోపాడ్స్ మ్యాక్స్ టీడబ్ల్యూఎస్
అమెజాన్ సేల్‌లో ఇవి 80% భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. మీరు క్రెడిట్ కార్డు ఆఫర్లు పెడితే మీకు కేవలం రూ.498కే లభిస్తాయి. ఈ బడ్స్ 13mm స్పీకర్లు ఉన్నాయి. అలాగే హెవీ బాస్ సౌండ్ కూడా ఉంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల వాయిస్ మంచిగా వస్తుంది. అయితే ఈ బడ్స్ మొత్తం 45 గంటల ప్లే టైమ్ అందిస్తాయి. దీనికి IPX4 రేటింగ్ ఉండటంతో పాటు డ్యూయల్ టోన్ డిజైన్ వల్ల చూడటానికి లుక్ కూడా బాగుంటుంది.
మివి డ్యుయోపాడ్స్ ఐ2
మివి బడ్స్ అమెజాన్‌లో కేవలం రూ.399కు లభిస్తున్నాయి. వీటిలో ఫీచర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటికి 13mm స్పీకర్లు ఉన్నాయి. అలాగే మంచి డీప్ బాస్ సౌండ్ కూడా ఉంది. ఇందులో AI ENC ఫీచర్ ఉండటం వల్ల కాలింగ్ సమయంలో బయట నుంచి ఎలాంటి అనవసర శబ్ధం కూడా రాదు. ఇందులో లో లాటెన్సీ మోడ్ కూడా ఉంది. గేమింగ్ వంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చెమట, వాటర్ వంటి వాటి నుంచి కూడా నిరోధకత లభిస్తుంది. ఈ బర్డ్స్‌కు క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఇవి 45 గంటల కంటే ఎక్కువ సమయం ప్లే అవుతాయి.
ఇది కూడా చూడండి: October Upcoming Mobiles: ఈ నెలలో ఫోన్ల జాతరే.. ఒకటి కాదు రెండు కాదు - మొత్తం ఎన్నంటే..!