AI Saree Trend: వామ్మో..వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్న బనానా ఏఐ చీర ట్రెండ్

జెమనై కొత్తగా బనానా ఏఐ చీర ట్రెండ్ ను ప్రవేశపెట్టింది. అమ్మాయిలు దీనిపై ప్రేమలో పడిపోయారు. కానీ దీంతో జాగ్రత్తగా ఉండకపోతే మీ పని అంతే అంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి బనానా ఏఐ చీర ట్రెండ్ తో తనకు కలిగిన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.

New Update
AI Saree Trend

ప్రస్తుతం అంతా ఏఐ హవా నడుస్తోంది. దానికి తగ్గట్టు టెక్ దిగ్గజాలు కూడా ఏదో ఒక కొత్త ట్రెండ్ ను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా జెమనైబనానాఏఐ చీర ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. అయితే దీంతో జాగ్రత్తగా ఉండాలంటూ ఓ అమ్మాయి ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్ మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వామ్మో ఇలా కూడా జరుగుతుందా..

టెక్నాలజీ అభివృద్ధి మంచిదే కానీ అది మన వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశిస్తే...ఆ ఆలోచనే భయపెడుతోంది కదా. సరిగ్గా ఝలక్ అనే అమ్మాయికి ఇదే జరిగింది. ఝలక్ కు బనానాఏఐ చీర ట్రెండ్ నిజంగానే పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ అమ్మాయికి చీర ట్రెండ్ తెగ నచ్చేసింది. దాంతో తాను చుడీదార్ వేసుకున్న ఫోటో ఒకటి జెమనైకి ఇచ్చి చీర ట్రెండ్ లోకి మార్చమంది. జెమనై కూడా మార్చేసింది. ఫోటో చాలా వచ్చింది. ఝలక్ కు బాగా నచ్చింది కూడా. వెంటనే దాన్ని తన ఇన్స్ట్రా గ్రామ్ లో అప్లోడ్ చేసింది. అయితే కొద్ది సేపటి తర్వాత చీర ట్రెండ్ ఫోటోను మళ్ళీ చూసినప్పుడు ఆ అమ్మాయికి పెద్ద షాక్ తగిలింది. ఏఐ అమ్మాయి ఫోటోను ఒక బ్లాక్ శారీలోకి మార్చింది. దానికి స్లీవ్ లెస్ బ్లౌజ్ ఇచ్చింది. అందులో ఝలక్ చేతి మీద ఒక పుట్టుమచ్చ క్లియర్ గా కనిపిస్తోంది. ఇదే ఆ అమ్మాయికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఝలక్ఏఐ కు ఇచ్చిన ఫోటోలో ఫుల్ స్లీవ్స్ ఉన్న చుడీదార్ వేసుకుంది. అరచేతుల వరకు స్లీవ్స్ ఉన్నాయి. దాన్నే ఆ అమ్మాయి జెమనైలోఅప్లోడ్ చేసింది. అందులో ఆ అమ్మాయి చేతి మీద పుట్టమచ్చ కనిపించే అవకాశమే లేదు. కానీ ఏఐ టెక్నాలజీ డ్రెస్ లోపల ఉన్న బాడీ పార్ట్స్ ను కూడా స్కాన్ చేస్తోంది. శరీరం మీద ఏమున్నాయో కూడా బయటపెడుతోంది.

ఇది తెలుసుకున్న ఝలక్ వెంటనే మరొక వీడియో ఇన్స్టాలోఅప్లోడ్ చేసింది. తనకు ఏఐ చీర ట్రెండ్ తో కలిగిన అనుభవాన్ని మొత్తం వివరంగా చెబుతూ పోస్ట్ పెట్టింది. కొత్తగా వచ్చింది కదా అని ప్రతీ దాన్ని ట్రై చేయకండి. టెక్నాలజీతో చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది. ఇదొక్కటే కాదు ఇంతకు ముందు వచ్చిన గిబిలీ, రీసెంట్ గా వచ్చిన బనానా నానో ట్రెండ్ ల మీద కూడా ఇలాంటి కంప్లైంట్సే వస్తున్నాయి. మనం అప్లోడ్ చేసిన ఫోటోలుఏఐదాచుకుటోందని...వి మరో చోట మన అనుమతి లేకుండానే ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు. బావుంటున్నాయి కదా అని ప్రతీ ట్రెండ్ ను ఫాలోఅవ్వద్దంటూ టెక్నికల్ పీపుల్ హెచ్చరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు