Vivo Y31 5G - Vivo Y31 Pro 5G: వివో నుంచి రెండు కిర్రాక్ ఫోన్లు.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో ఫీచర్లు హైలైట్

వివో Y31 5G, వివో Y31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో విడుదలయ్యాయి. ఈ ఫోన్లు 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చాయి. Y31 5G రూ.14,999 ప్రారంభ ధరతో వచ్చింది. Y31 ప్రో 5G రూ.18,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

New Update
Vivo Y31 5G - Vivo Y31 Pro 5G Offers

Vivo Y31 5G - Vivo Y31 Pro 5G Offers

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మార్కెట్‌లో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా Vivo, Vivo Y31 5G, Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. Vivo Y31 5G మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.68-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీనితో పాటు ఇది 44W ఫ్లాష్‌ఛార్జ్‌తో కూడిన పెద్ద 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు ఈ రెండు Vivo Y31 5G, Y31 Pro 5Gకి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Vivo Y31 5G Price

Vivo Y31 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999 కాగా.. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ గ్రీన్, రోజ్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 

Vivo Y31 Pro 5G Price

Vivo Y31 Pro 5G ధర విషయానికొస్తే.. ఈ మోడల్ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా.. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మోచా బ్రౌన్, డ్రీమీ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 

Also Read :  వామ్మో..వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్న బనానా ఏఐ చీర ట్రెండ్

Vivo Y31 5G - Vivo Y31 Pro 5G Offers

ఈ రెండు ఫోన్‌లు ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వివో అధికారిక సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్ కింద Y31 5G పై రూ. 1000, Y31 Pro 5G పై రూ. 1500 తగ్గింపు పొందుతారు. అదే సమయంలో 3 నెలల నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.

Vivo Y31 5G Specs

Vivo Y31 5G మొబైల్ 6.68 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1608 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Vivo Y31 5G ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా FuntouchOS 15పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్ ఉన్నాయి.

కెమెరా సెటప్ విషయానికొస్తే..Vivo Y31 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.08-మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Vivo Y31 5G వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది.

Also Read :  ఫ్రీ ఫ్రీ.. ఐఫోన్ 15 ఫ్రీగా పొందే అమెజాన్ అద్భుత అవకాశం.. జస్ట్ ఇలా చేస్తే చాలు

Vivo Y31 Pro 5G Specs

Vivo Y31 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2408×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Vivo Y31 Pro 5G ఆక్టా కోర్ MediaTek Dimensity 7300 4nm ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇందులో Mali-G615 MC2 GPU అందించారు. Vivo Y31 Pro 5G మొబైల్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా OriginOS 15లో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాల్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Vivo Y31 Pro 5Gలో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు