Mobile Offers: తస్సాదియ్యా ఆఫర్ అదిరింది.. వన్‌ప్లస్ కిర్రాక్ డిస్కౌంట్ - వదలొద్దు మావా!

OnePlus Nord CE4 5G స్మార్ట్‌ఫోన్ విజయ సేల్స్‌లో అదిరిపోయే డిస్కౌంట్‌తో లభిస్తోంది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999కు బదులుగా రూ.21,999కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 3000) పొందొచ్చు.

New Update
OnePlus Nord CE4 5G

OnePlus Nord CE4 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ దూసుకుపోతుంది. వరుస ఫోన్లను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేస్తూ అదరగొడుతోంది. ఇప్పటికే పలు ఫోన్లను లాంచ్ చేసింది. అదే సమయంలో ఫోన్లపై ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మరో మోడల్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. OnePlus Nord CE4 5G ఫోన్ పై కిక్కిచ్చే డిస్కౌంట్ అందిస్తుంది. ఇది OnePlus నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ రూ.5,000 తక్కువ ధరకు లభిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ విజయ్ సేల్స్‌లో దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్యాంక్ ఆఫర్లతో పాటు భారీ ధరల తగ్గింపులను అందిస్తోంది. 

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

OnePlus Nord CE4 5G Offers

OnePlus Nord CE4 5G ఫోన్ ఈ ఏడాది భారతదేశంలో రూ. 24,999 కు లాంచ్ అయింది. ఇందులో 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ విజయ్ సేల్స్‌లో రూ.21,999 కు లిస్ట్ అయింది. దీనితో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే 10 శాతం తక్షణ తగ్గింపు (రూ. 3000 వరకు) పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీన్ని కొనుక్కోవచ్చు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

OnePlus Nord CE4 5G Specifications

OnePlus Nord CE4 5G ఫోన్ 1080x2412 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను వస్తుంది. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14 పై పనిచేస్తుంది. Nord CE 4 వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. 

Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే.. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

 

tech-news | telugu tech news | tech-news-telugu | latest-telugu-news | telugu-news | oneplus-nord

Advertisment
Advertisment
తాజా కథనాలు