National Technology Day: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా  1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.

New Update
MODI

ఇండియా, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే కాల్పులు అంగీకారాన్ని పాక్ కొన్ని గంటల్లోనే బ్రేక్ చేసి జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దులో కాల్పులకు పాల్పడింది.  దీనికి ధీటుగా భారత బలగాలు కూడా సమాధానం ఇచ్చాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ కూడా ప్రతి దాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదు. పాకిస్థాన్ POKను, టెర్రరిస్టులను భారత్ కు అప్పగించాలి. ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ విషయంలో మరే దేశ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు.

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా  1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.

Also Read :  బలితీసుకున్న బియ్యం డబ్బా.. 7 ఏళ్ల బాలుడు మృతి

PM Modi Tweet On National Technology Day

Also Read :  శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి!

మన దేశ వృద్ధి పథంలో, ముఖ్యంగా స్వావలంబన వైపు మన అన్వేషణలో ఒక మైలురాయి సంఘటన అని కొనియాడారు. భారత్ అంతరిక్షం, AI, డిజిటల్ ఆవిష్కరణ, గ్రీన్ టెక్నాలజీ మరిన్నింటిలో సాంకేతిక పరిజ్ఞానం వివిధ అంశాలలో ఎదుగుతోందని తెలిపారు. సైన్స్. పరిశోధన ద్వారా భవిష్యత్ తరాలను శక్తివంతం చేయడానికి మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామన్నారు.  సాంకేతికత మానవాళిని ఉద్ధరించాలని, మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలి..  భవిష్యత్ వృద్ధిని నడిపించాలని ట్వీట్ చేశారు మోదీ.  

Also Read :  ఆపరేషన్ సింధూర్ సీక్రెట్ బయటపెట్టిన UP సీఎం యోగి

Also Read :  టెర్రరిస్టు కొడుక్కే ఆర్మీ ప్రతినిధి పగ్గాలు.. ఎవరీ అహ్మద్ షరీఫ్ చౌదరి?

 

telugu-news | narendra-modi | latest-telugu-news | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు