INDIAN ARMY: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్పుల విరమణలో కీలక పాత్ర పోషించారు. ఆర్మీ ఆపరేషన్స్, యుద్ధ సన్నద్ధత, ఫైరింగ్ ఆదేశాలు DGMO ఇస్తారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో అధికారికి మాత్రమే ఇస్తారు. ఆర్మీ చీఫ్, రక్షణ శాఖ కలిసి ఎంపిక చేస్తారు.

New Update
Army

ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల డీజీఎంఓలు కాల్పుల విరమణపై అంటే యుద్ధాన్ని ఆపుతున్నట్లు ఓ ఒప్పందానికి చేరుకున్నారు. దీంతో శనివారం నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. మొదట పాకిస్తాన్ డిజిఎంఓ ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాత భారత్ దానికి అంగీకరించింది. తర్వాత DGMO అనే పదం బాగా వార్తల్లో నిలిచింది. ఇండియా పాక్ యుద్ధ వాతావరణ సమయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) కీలక పాత్ర పోషిస్తారు. 

యుద్ధం, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్మీ స్ట్రాటజీ అమలు చేసే రెండు దేశాల ఆర్మీ ఆఫీసర్లు వీరే. ఇరు దేశాల ఆర్మీ ఆపరేషన్లపై వీరికి అధికారం ఉంటుంది. ప్రభుత్వం, పై అధికారుల ఆదేశాల అనుగుణంగా DGMOలు నడుచుకుంటారు. ఇండియాలో DGMO పదవిని లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న అధికారికి మాత్రమే ఇస్తారు  ఆర్మీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ కలిసి ఎంపిక చేస్తారు. దీనికి ఎటువంటి ఓపెన్ రిక్రూట్‌మెంట్ లేదా పరీక్ష ఉండదు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారుల సలహా మేరకు, అభ్యర్థి ట్రాక్ రికార్డ్ పరిశీలించి తీసుకుంటారు. అలాగే ఎక్స్‌పీరియన్స్, లీడర్‌షిప్, వ్యూహరచన సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

ఇండియన్ ఆర్మీలో ఆయన కీలక ఆపరేషన్లు, సైన్యం ప్రధాన కార్యకలాపాలను ప్లాన్ చేస్తారు. అతను నేరుగా ఆర్మీ చీఫ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం మధ్య సమన్వయం చేస్తాడు. భారత సైన్యంలో యుద్ధం, ఉగ్రవాదం వ్యతిరేక, శాంతి కార్యకలాపాలకు వ్యూహాన్ని రూపొందించడమే DGMO పని. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతను తగ్గించడం, కాల్పుల విరమణ, ఫైరింగ్ ఆదేశాలు, సైనిక నిఘా అర్థం చేసుకోవడమే DGMO బాధ్యతలు. అంతేకాదు అనుకోని పరిస్థితులు వస్తే అందుకు ఆర్మీని సిద్ధంగా ఉంచడం కూడా DGMO పనే. ప్రస్తుతం భారత సైన్యం యొక్క DGMO లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ. ఆయన జూలై 1, 2023న DGMO గా నియమితులయ్యారు. దీనికి ముందు ఆయన ఖర్గా కార్ప్స్‌కు కమాండ్‌గా పనిచేశారు. నియంత్రణ రేఖపై అనేక కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అతను పాకిస్తాన్ DGMOతో హాట్‌లైన్‌లో మాట్లాడి సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణను అమలు చేశారు.

(india | pakistan | latest-telugu-news | india pak war | big twist In India Pak War | operation Sindoor | india operation sindoor | army-officer)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు