/rtv/media/media_files/2025/05/11/Hb3fEIh4XU8XkjMB52sa.jpg)
Operation Sindoor 2.o
యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ ఆపలేదని ఇండియన్ ఫోన్స్ ఎక్స్ లో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. త్రివిధ దళాలతో ప్రధాని మోదీ భేటీ అనంతరం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్‌కు వాళ్ల స్టయిల్‌లోనే మోదీ బుద్ధి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
#OperationSindoor | Indian Air Force tweets, "...Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information." pic.twitter.com/tRSoEEZj8t
— ANI (@ANI) May 11, 2025
అప్పగించిన పనిని బాధ్యతగా విజయవంతం చేశామని ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని వాయుసేనా పేర్కొంది. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట పాకిస్తాన్ కాల్పులకు తెగించింది. దీంతో భారత్ పాకిస్తాన్ వైఖరిని ఖండించింది. ప్రధాని మోదీ తన నివాసంలో ఈరోజు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, సీడీఎస్, త్రివిధ దళాలాధిపతులతో సమావేశమైయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎయిర్ ఫోర్స్ ఇలా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.