/rtv/media/media_files/2025/11/14/oneplus-15-launched-2025-11-14-18-49-10.jpg)
OnePlus 15 Launched
OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ చిప్‌సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం OnePlus గేమింగ్‌పై దృష్టి పెట్టింది. ఇది గేమర్‌ల కోసం అధిక-రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ ప్యానెల్‌ను అందించింది.
OnePlus 15 price
OnePlus 15 బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999 నుండి ప్రారంభమవుతుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ కలిగిన టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది.
OnePlus 15 కొత్త Sand Dune కలర్ ఆప్షన్‌లో వస్తుంది. Infinite Black, Ultra Violet కూడా అందుబాటులో ఉంటాయి. OnePlus 15 ఫోన్ ఓపెన్ సేల్ ఆల్రెడీ ప్రారంభమైంది. దీనిని Amazon(amazon mobile offers), OnePlus ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుక్కోవచ్చు.
OnePlus 15 పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. బేస్ 12GB వేరియంట్‌ను కేవలం రూ.68,999 ధరకు కొనుక్కోవచ్చు. అదే సమయంలో 16GB వేరియంట్ రూ.75,999 కు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా OnePlus 15ను పరిమిత-కాల ఓపెన్ సేల్ ఆఫర్‌లో భాగంగా.. ముందుగా కొనుగోలు చేసిన వారికి OnePlus Nord Buds 3 ఉచితంగా లభిస్తుంది. కంపెనీ లైఫ్‌టైమ్ డిస్‌ప్లే వారంటీ, 180 రోజుల ఫోన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్, రూ.4,000 అప్‌గ్రేడ్ బోనస్ వంటి ఆఫర్‌లను కూడా ప్రకటించింది.
Also Read: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. 10 గ్రాముల గోల్డ్‌పై భారీగా తగ్గిన ధరలు!
OnePlus 15 Specifications
OnePlus 15 కెమెరా మాడ్యూల్ డిజైన్ పూర్తిగా ఛేంజ్ అయింది. ఇది 6.78-అంగుళాల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 1, 165Hz రిఫ్రెష్ రేట్ల మధ్య ఛేంజ్ అవుతుంది. 1800 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. OnePlus 15.. BOE ఫ్లెక్సిబుల్ ఓరియంటల్ OLED ప్యానెల్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌కు మద్దతు ఇస్తుంది.
OnePlus 15 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 -ఆధారిత కలర్ OS 16పై నడుస్తుంది. కంపెనీ ఈ సంవత్సరం గేమింగ్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. OnePlus 15 ఫోన్ కొత్త ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కొన్ని గేమ్‌లకు 165 fps సపోర్ట్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
OnePlus 15లో 50MP ప్రధాన వెనుక కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. 8K రిజల్యూషన్ వరకు వీడియోను రికార్డ్ చేయగల హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ సిస్టమ్ కూడా ఉంది. ముందు భాగంలో 32MP షూటర్‌ను కలిగి ఉంది.
OnePlus 15 ఫోన్ 7,300mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది మాగ్నెట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, NFC మరియు స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
Also Read : మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!
Follow Us