Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

New Update
Moto G67 Power 5G Launched

Moto G67 Power 5G Launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Moto G67 Power 5G Price

అందులో 8 GB RAM + 128 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 15,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. అప్పుడు దీని ధర మరింత తగ్గుతుంది. అలాగే టెలికాం కంపెనీ రిలయన్స్ జియో రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 2,000 క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. Moto G67 Power 5G పాంటోన్ బ్లూ కురాకో, పాంటోన్ పారాచూట్ పర్పుల్, పాంటోన్ సిలాంట్రో కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు.

Moto G67 Power 5G specs

Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ LCD (1,080 × 2,400 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, 391 ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. దీని డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా 7i రక్షణ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌‌తో వస్తుంది. Moto G67 Power 5Gలోని RAMని వర్చువల్‌గా 24 GB వరకు విస్తరించవచ్చు. ఇది Android 15 ఆధారంగా హలో UIపై నడుస్తుంది. భద్రత కోసం దీనికి ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌కు ఒక OS అప్‌గ్రేడ్, మూడు సంవత్సరాల భద్రతా అప్డేట్‌లను అందించారు.

Moto G67 Power 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, టూ-ఇన్-వన్ ఫ్లికర్ కెమెరా ఉన్నాయి. 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Moto G67 Power 5G.. 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు