New Smartphone: మార్కెట్‌లోకి కొత్త సరుకు.. పిచ్చెక్కిస్తున్న నథింగ్ కొత్త మోడల్..!

నథింగ్ తన కొత్త Nothing Phone 3a Liteను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది.

New Update
Nothing Phone 3a Lite Launched

Nothing Phone 3a Lite Launched

నథింగ్ తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్(new-smartphone) Nothing Phone 3a Liteను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. నథింగ్ సిగ్నేచర్ గ్లిఫ్ లైట్ సిస్టమ్ కూడా వెనుక ప్యానెల్‌లో ఉంది. ఇది నోటిఫికేషన్‌లు, అలర్ట్‌ల కోసం ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

Also Read :  నవంబర్‌లో సెలవులే సెలవులు.. మొత్తం ఎన్నంటే..?

Nothing Phone 3a Lite Price

కొత్త Nothing Phone 3a Lite ధర విషయానికొస్తే.. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ సుమారు రూ. 25,600 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దీని 256GB వేరియంట్ ధర సుమారు రూ. 28,700గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ప్రకారం.. ఈ ఫోన్ ఈరోజు నుండి ఎంపిక చేసిన మార్కెట్లలో వైట్ అండ్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. 128GB వేరియంట్ నథింగ్ వెబ్‌సైట్, రిటైల్ పాట్నర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే 256GB మోడల్ కంపెనీ ఆన్‌లైన్ సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 

Also Read :  ఆఫర్ అరాచకం.. వాషింగ్ మెషీన్లపై బంపర్ డిస్కౌంట్లు.. బెస్ట్ డీల్స్ ఇవే..!

Nothing Phone 3a Lite Specs

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Nothing Phone 3a Series 6.77-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో (4nm) చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8GB RAM + 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డును ఉపయోగించి 2TB వరకు విస్తరించుకోవచ్చు. 

Nothing Phone 3a Lite ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.5 తో నడుస్తుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. Nothing Phone 3a Lite  ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. 

కెమెరా విషయానికొస్తే.. కంపెనీ OIS, EIS రెండింటికీ మద్దతుతో 50MP ప్రైమరీ సెన్సార్‌ను అందించింది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, మూడవ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, గెలీలియో ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు