Bank Holidays November 2025: నవంబర్‌లో సెలవులే సెలవులు.. మొత్తం ఎన్నంటే..?

అక్టోబర్ నెల ముగియడానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభం కానుంది. అందువల్ల మీరు నవంబర్‌లో ఏవైనా బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు ఏ ఏ రోజుల్లో పని దినాలను కలిగి ఉంటుందో తెలుసుకోవాలి.

New Update
Bank Holidays November 2025

Bank Holidays November 2025

అక్టోబర్ నెల ముగియడానికి మరొక్క రోజు మాత్రమే ఉంది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభం కానుంది. అందువల్ల మీరు నవంబర్‌లో ఏవైనా బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకు ఏ ఏ రోజుల్లో పని దినాలను కలిగి ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నెల (అక్టోబర్)లో ఎక్కువ సెలవులు వచ్చాయి. అందువల్ల నవంబర్‌లో కూడా బ్యాంకుకు ఎన్ని రోజులు సెలవులు(Bank Holidays November 2025) వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

అక్టోబర్ కంటే నవంబర్‌లో తక్కువ సెలవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజులు మూతపడే అవకాశం ఉంది. వీటిలో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవు దినాలలో డిజిటల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి. ఈ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం. 

Also Read :  ఆఫర్ అరాచకం.. వాషింగ్ మెషీన్లపై బంపర్ డిస్కౌంట్లు.. బెస్ట్ డీల్స్ ఇవే..!

Bank holidays in November 2025

నవంబర్ 1 (శనివారం):కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా బెంగళూరులో, ఇగాస్-బాగ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 2 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.

నవంబర్ 5 (బుధవారం):గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 7 (శుక్రవారం): వంగలా పండుగ కోసం షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 8 (శనివారం): రెండవ శనివారం – దేశవ్యాప్తంగా సెలవు. కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులు కూడా మూసివేయబడతాయి.

నవంబర్ 9, 16, 23, 30 (ఆదివారం): దేశవ్యాప్తంగా సెలవు.

నవంబర్ 22 (శనివారం): నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా సెలవు.

మొత్తం మీద నవంబర్‌లో 9 నుండి 10 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల మీరు చెక్కులను డిపాజిట్ చేయాలనుకున్నా.. పాస్‌బుక్‌ను అప్డేట్ చేయాలని అనుకున్నా.. డబ్బులు సంబంధిత పనులను బ్యాంకుల ద్వారా నిర్వహించాలనుకున్నా బ్యాంకు పని దినాలలో మాత్రమే చేయాలని గుర్తించుకోండి. ఎందుకంటే సెలవు దినాలలో ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఇది కాకుండా మీరు 24/7 పనిచేసే డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, ATMలను ఉపయోగించవచ్చు.

Also Read :  ఆధార్‌ కార్డు నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు.. నవంబర్ 1న మారనున్న కొత్త రూల్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు