Infinix Hot 60 5G+: హీట్ పెంచేసిన Hot ఫోన్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Infinix Hot 60 5G+ భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా ఉంది. జూలై 17 నుండి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.

New Update
Infinix Hot 60 5G+ smartphone launched in india

Infinix Hot 60 5G+ smartphone launched in india


ఇన్ఫినిక్స్ తన సరసమైన స్మార్ట్‌ఫోన్ Infinix Hot 60 5G+ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Infinix Hot 60 5G+ మొబైల్ 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5200mAh బ్యాటరీ ఉంది. ఇప్పుడు Infinix Hot 60 5G+ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర మొదలైన వాటి గురించి తెలుసుకుందాం. 

Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!

Infinix Hot 60 5G+ Price

Infinix Hot 60 5G+ స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్, షాడో బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. జూలై 17 నుండి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. 

Infinix Hot 60 5G+ Bank OFFERS

లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే.. అన్ని బ్యాంకుల కార్డ్‌ల చెల్లింపుపై రూ.500 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో స్టాక్ ఉన్నంత వరకు ఇన్ఫినిక్స్ స్టోర్‌లో ఫ్రీ XE23 TWS ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చు. 

Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!

Infinix Hot 60 5G+ Specifications

Infinix Hot 60 5G+ మొబైల్‌లో 6.7-అంగుళాల HD + LCD డిస్ప్లే ఉంది. ఇది 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IMG BXM-8-256 GPUతో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 6nm ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15లో పనిచేస్తుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 

Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Infinix Hot 60 5G+ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5200mAh బ్యాటరీ ఉంది. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm ఆడియో జాక్, FM రేడియో, USB టైప్ C 2.0 పోర్ట్ ఉన్నాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు