New Smartphone: రూ.1,899కి లాంచ్ అయిన ఊరమాస్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్..!

HMD సంస్థ భారతదేశంలో కొత్తగా మూడు ఫోన్లను విడుదల చేసింది. వాటిలో HMD Vibe 5Gతో పాటు HMD 101 4G, HMD 102 4G ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. HMD Vibe 5G ధర రూ.8,999, HMD 101 4G ధర రూ.1,899, HMD 102 4G ధర రూ.2,199 గా ఉన్నాయి.

New Update
HMD Vibe 5G

HMD Vibe 5G

ఒకప్పుడు నోకియా ఫోన్‌లను తయారు చేసిన HMD కంపెనీ ఇప్పుడు దాని స్వంత పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. శక్తివంతమైన ఫీచర్లను తన ఫోన్లలో అందించి కొత్త కొత్త ఫోన్‌లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగానే HMD తన కొత్త స్మార్ట్‌‌ఫోన్‌ HMD Vibe 5Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉంది. 

ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా అందించారు. దీని ప్రైమరీ సెన్సార్ 50MPతో వస్తుంది. కెమెరా మాడ్యూల్‌ను కవర్ చేసే వెనుక ప్యానెల్‌పై నోటిఫికేషన్ లైట్ వస్తుంది. దీనితో పాటు కంపెనీ రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది అందులో ఒకటి- HMD 101 4G కాగా మరొకటి HMD 102 4G ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 1000mAh బ్యాటరీ, 2-అంగుళాల QQVGA డిస్ప్లే, 32GB వరకు మెమరీ మద్దతుతో వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోన్‌ల ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం. 

Also Read :  గూగుల్ పిక్సెల్ 9 పై రూ.45,000 భారీ తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్ అదుర్స్..!

HMD Vibe 5G Price & Specs

HMD Vibe 5G ప్రత్యేక ధర రూ.8,999 కు ప్రారంభించబడింది. HMD Vibe 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD+ HID LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం కంపెనీ 8MP కెమెరాను అందించింది. 

HMD Vibe 5G మొబైల్‌కు శక్తినివ్వడానికి కంపెనీ 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని అందించింది. ఈ హ్యాండ్‌సెట్ 5G (9 బ్యాండ్‌లు) కనెక్టివిటీతో వస్తుంది. దీనికి Unisoc T760 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌లో 4GB RAM + 128GB స్టోరేజ్ ఉన్నాయి. 

Also Read :  5000ఎంఏహెచ్​ బ్యాటరీతో శాంసంగ్ బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఫీచర్ ఫోన్ల స్పెసిఫికేషన్లు

HMD 101 4G ఫోన్, HMD 102 4G ఫోన్ రెండూ 2-అంగుళాల QQVGA డిస్ప్లేను కలిగి ఉన్నాయి. దీనికి 1000mAh బ్యాటరీ అందించారు. ఈ హ్యాండ్‌సెట్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. HMD 102 4Gలో మీకు QVGA కెమెరా అందించారు. ఇది ఫ్లాష్ లైట్‌తో వస్తుంది. 

HMD 101 4G ఫీచర్ ఫోన్‌ను కంపెనీ రూ.1899లకి విడుదల చేసింది. అదే సమయంలో HMD 102 4G ఫీచర్ ఫోన్ ధరను కంపెనీ రూ.2199గా నిర్ణయించింది. ఈ మూడు ఫోన్లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రధాన రిటైల్ షాప్‌ల నుండి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ల సేల్స్ సెప్టెంబర్ 12 నుండి అందుబాటులోకి వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు