/rtv/media/media_files/2025/09/12/google-pixel-9-smartphone-offers-1-2025-09-12-09-31-03.jpg)
Google Pixel 9 smartphone offers
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ దసర, దీపావళి సందర్భంగా ఈ ఏడాది అతిపెద్ద సేల్‌ను ఇటీవల ప్రకటించింది. Flipkart Big Billion Days Sale సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు పొందవచ్చు. అందువల్ల మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ సేల్‌లో మంచి డీల్‌లను పొందవచ్చు.
ఈ-కామర్స్ సైట్ ఇప్పటికే అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్‌లను వెల్లడించింది. అందులో Google Pixel 9 ఒకటి. ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు Flipkart Big Billion Days Saleలో Google Pixel 9 ఫోన్‌పై అందుబాటులో ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read : వైరల్ అవుతున్న నానో బనానా ట్రెండ్.. ఫోటోలను త్రీడీ బొమ్మలుగా మారుస్తున్న ఏఐ
Google Pixel 9 Offers
flipkart-big-billion-days-sale లో Google Pixel 9పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌లోని 12GB RAM / 25GB స్టోరేజ్ వేరియంట్ ఆగస్టు 2024 లో రూ.79,999 కు లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.64,999 కు లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు Big Billion Days Saleలో దీనిని అతి చౌక ధరకే కొనుక్కోవచ్చని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. దీనిని కేవలం రూ.34,999కే సొంతం చేసుకోవచ్చని వెల్లడింది.
ఈ డీల్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర ఆఫర్‌లు ఉండే అవకాశం ఉంది. దీనిబట్టి Google Pixel 9 మొబైల్ లాంచ్‌తో పోలిస్తే రూ.45 వేలు తగ్గుతుంది. పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల Actua OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080x2424 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz-120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇదిలా ఉంటే Google Pixel 9 తో పాటు.. Google Pixel 9 Pro XL పై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లోని Google Pixel 10, Google Pixel 10 Pro, Google Pixel 10 XL ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ రాబోయే సేల్ సమయంలో భారీ డిస్కౌంట్లను పొందుతాయి.
Also Read : కిక్కే కిక్కు.. Samsung మడతపెట్టే ఫోన్‌పై రూ.53వేల భారీ డిస్కౌంట్.. చూస్తే అస్సలు వదలరు!
Flipkart Big Billion Days Sale Offers
ఈ-కామర్స్ సైట్‌లో Flipkart Big Billion Days Sale సెప్టెంబర్ 22 నుండి ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 23 నుండి ఇతరులు ఈ సేల్ ప్రయోజనాన్ని పొందుతారు. సేల్ సమయంలో కస్టమర్‌లు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసిన చెల్లింపులపై అదనపు పొదుపులను పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్‌పై కూడా భారీ పొదుపులు ఉంటాయి. ధరల తగ్గింపులతో పాటు, యుపిఐ లింక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఇఎంఐ ప్లాన్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, సూపర్ కాయిన్‌లు వంటి ఇతర ప్రయోజనాలను ఈ సేల్‌లో రీడీమ్ చేసుకోవచ్చు.