Samsung Smartphone: 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో శాంసంగ్ బడ్జెట్​ ఫ్రెండ్లీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

శాంసంగ్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. Samsung Galaxy F17 పేరుతో 5జీ ఫోన్‌ను రిలీజ్ చేసింది. బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.13,999 ఉంది. అదే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,499గా ఉంది.

New Update
Samsung Galaxy F17

Samsung Galaxy F17

దేశీయ కంపెనీ శాంసంగ్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీలో బోలెడన్నీ ఫీచర్లతో మొబైల్ అయితే అదిరిపోయింది. Samsung Galaxy F17 పేరుతో 5జీ ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీని ధర తక్కువగా ఉండటంతో పాటు ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మొబైల్‌కు నీటి తుంపరలు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. అంతేకాకుండా ఇందులో సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్ వంటి సరికొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే కూడా యూజర్లకు బాగా ఆకట్టుకుంటాయి. ఈ మొబైల్‌కి 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్తో వస్తుంది. కాబట్టి స్క్రీన్ చాలా స్పష్టంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.

ఇది కూడా చూడండి: IPhone 16 Vs IPhone 17: ఐఫోన్ 16 కంటే 17లో ఏ ఫీచర్లు మారాయో తెలుసా? లిస్ట్ ఇదే..!

రోజులో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే చాలు..

డిస్‌ప్లేకి అదనపు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కవచం ఉంది. దీనివల్ల పెద్దగా ఎలాంటి సమస్య ఉండదు. ఈ ఫోన్‌లో 5ఎన్ఎమ్ ఎక్సీనోస్ 1330 ప్రాసెసర్‌ను వాడతారు. దీనివల్ల ఫోన్ వేగంగా పనిచేయడానికి ఇది బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ బ్యాటరీ 5,000 ఎంఏహెచ్ ఉంది. ఇది రోజంతా ఫోన్ వాడకానికి సరిపోతుంది. రోజుకు ఒకసారి ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. దీనికి 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ శాంసంగ్ ఫోన్‌కు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ తెలిపింది. అలాగే ఆరు పెద్ద ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్స్ కూడా అందిస్తారు. దీనివల్ల ఎక్కువ ఏళ్లు కూడా ఈ మొబైల్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఫొటోలు కోసం శాంసంగ్ మొబైల్ కొంటారు. అయితే ఈ మొబైల్‌లో ఫొటోలు కూడా బాగుంటాయి. వెనుక వైపున 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ కూడా ఉంది.

ఇది కూడా చూడండి: iPhone 17 Air: ఐఫోన్ ఎయిర్ డిజైనర్ మనోడే.. అబిదుర్ చౌదరి దెబ్బకు యాపిల్‌ కంపెనీ షేక్!

ఇది ఫోటోలు తీసేటప్పుడు ఫోన్ కదిలినా క్లియర్ ఫోటోలు రావడానికి సహాయపడుతుంది. ప్రధాన కెమెరాతో పాటు 5 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం అయితే ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ ఉంది. ఈ Samsung Galaxy F17 ఫోన్ రెండు రంగుల్లో లభిస్తుంది. వైలెట్ పాప్, నియో బ్లాక్‌లో ఉంటుంది. అయితే మొబైల్ స్టోరేజ్, ర్యామ్ బట్టి ధర ఉంటుంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.13,999 ఉంది. అదే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.15,499గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర అయితే రూ.16,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఇప్పుడు రిటైల్ స్టోర్లలో, శాంసంగ్ వెబ్‌సైట్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు, 5జీ కనెక్టివిటీ, ఇంకా దీర్ఘకాలిక అప్‌డేట్స్ కావాలనుకునే వారికి ఈ మొబైల్ బెస్ట్ అని చెప్పవచ్చు. 

Advertisment
తాజా కథనాలు