Brazil hot air balloon: ఘోరం.. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ బ్లాస్ట్.. గాల్లోనే 8 మంది మృతి (వీడియో)

బ్రెజిల్‌లో పెను ప్రమాదం జరిగింది. శాంటా కాటరినా దక్షిణ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగడంతో 8 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

New Update
Brazil hot air balloon

Brazil hot air balloon

బ్రెజిల్‌లో పెను ప్రమాదం జరిగింది. శాంటా కాటరినా దక్షిణ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగడంతో  8 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో మరో 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

Brazil Hot Air Balloon

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

అధికారుల ప్రకారం..  బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో బ్రెజిలియన్ కప్పడోసియా అనే ఒక ప్రధాన పర్యాటక కేంద్రం ఉంది. అక్కడికి వెళ్లే పర్యాటకులు హాట్ ఎయిర్ బెలూన్లపై వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో భాగంగానే ఓ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌.. విహారం కోసం గాల్లోకి ఎగిరింది. అందులో పైలట్‌‌తో పాటు మరో 21 మంది ఉన్నారు.

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Also Read :  బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

అలా గాల్లో విహారం చేసిన కాసేపటికే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అలా చూస్తుండగానే ఆ మంటలు పెద్దగా వ్యాపించాయి. దీంతో ఆ బెలూన్‌ మొత్తం కాలిపోయి గాల్లో నుంచి కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో 8 మంది మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Latest crime news | crime news | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు