Iran-Israel War: ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్‌జీసీ కమాండర్ల మృతి

ఇరాన్ కు నిన్న, ఈరోజు బాగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ కు చెందిన ముగ్గురు కీలక కంమాండర్లు మృతి చెందారు. మరోవైపు యూఎస్ మూడు న్యూ క్లియర్ రియాక్టర్లను పేల్చేసింది. 

New Update
3 commanders

IRGC officials killed

ఇజ్రాయెల్ తో తొమ్మిదో రోజు జరిగిన యుద్ధంలో ఇరాన్ చాలానే పోగొట్టుకుంది. ఇజ్రాయెల్ కు అమెరికా కూడా తోడవడంతో ఆ దేశం చాలా నష్టపోయింది. ముఖ్యంగా ఐఆర్జీసీ కు చెందిన ముగ్గురు కీకల కమాండర్లను ఇరాన్ పోగొట్టుకుంది. అణుస్థావరాలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ కీలక అణు కేంద్రాల్లో ఒకటైన ఇస్ఫహాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దానికి భారీగా నష్టం కలిగించినట్టు తెలుస్తోంది. బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేసే కర్మాగారాలపై బాంబుల వర్షం కురిపించింది. కుజెస్థాన్‌ ప్రావిన్స్‌లో ఇరాన్‌ సైనిక మౌలిక సదుపాయాలనూ నాశనం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ కమాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

Also Read :  వారికి నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ చీఫ్ రంగనాథ్

Also Read :  పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్..14 రోజుల రిమాండ్

ఇరాన్ పని అయిపోయినట్టే..

మరోవైపు తాము దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అణుకేంద్రాలను, క్షిపణి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఇక స్విట్జర్లాండ్ లో యూరోప్ విదేశాంగ మంత్రులు, ఇరాన్‌ విదేశాంగమంత్రి అబ్బాస్‌ అరాగ్చీ మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు. దీంతో పాటూ అగ్రా.్యం అమెరికా కూడా యుద్ధంలోకి అడుగుపెట్టేసింది. రెండు వారాల తర్వాత అంటూనే రాత్రి ఇరాన్ ప్రధాన అణుస్థావరాలపై దాడులు చేసింది. ఫార్డో ను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. యుద్ధం కారణంగా ఇప్పటివరకు ఇరాన్ లో 430 మంది చనిపోయారని, 3,500 మందికి గాయాలయ్యాయి. టెహ్రాన్‌ దాడుల్లో 25 మంది మృతి చెందారని, 2,517 మంది క్షతగాత్రులయ్యారని ఇజ్రాయెల్‌ చెప్పింది. 

Also Read: Ind vs Eng: బ్యాటింగ్ సూపర్ హిట్...బౌలింగ్ ఫట్

Also Read :  ప్రియుడితో సుఖం.. కన్నబిడ్డలకు రసగుల్లాలో విషం కలిపి చంపేసిన తల్లి!

israel-attacks | today-latest-news-in-telugu

Advertisment
తాజా కథనాలు