BEST CAMERA PHONES: 200MPతో బెస్ట్ కెమెరా ఫోన్లు.. రూ.30వేలలోపు లిస్ట్ చూసేయండి..!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కేవలం రూ.30వేల లోపే కొనుక్కోవచ్చు. ఇవి 200 ఎంపీ రెజుల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. అందులో Vivo V60e, Motorola Edge 60 Pro, Nothing Phone (3a) Pro, Vivo T4 Pro, Realme 15 Pro ఉన్నాయి.

New Update
BEST CAMERA PHONES

BEST CAMERA PHONES

స్మార్ట్‌ఫోన్(mobile-offers) మార్కెట్‌లో కెమెరా ఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఫోన్ ఉంటే చాలు అని అనుకునే వారు. కానీ ఇప్పుడు అలా లేదు. కేవలం బెస్ట్ ఫొటోగ్రఫీ ఫోన్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. అలాంటి ఫోన్ల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా(Social Media) వినియోగం అధికమైన క్రమంలో కెమెరా ఫోన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన ఆపిల్, శామ్‌సంగ్, షియోమి వంటి అగ్ర బ్రాండ్‌లు తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీంతో తమ కొత్త కొత్త మోడళ్లలో హై క్వాలిటీ గల కెమెరా ఫీచర్లను అందించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి కెమెరా ఫోన్(best camera phones) ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో రూ.30,000 లోపు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో కూడిన అనేక ఫోన్‌లు ఉన్నాయి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Also Read :  ఊరమాస్ డిస్కౌంట్.. Iphone 16పై రూ.16వేలకు పైగా తగ్గింపు..!

Vivo V60e

Vivo V60eలో  200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో HP9 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉన్నాయి. వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 50-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా ఉంది. Vivo V60e ఫోన్ ఆరా లైట్‌కు మద్దతు ఇస్తుంది. తక్కువ-కాంతి పోర్ట్రెయిట్‌లను మెరుగుపరిచే AI- పవర్డ్ పోర్ట్రెయిట్ మోడ్‌తో భారతదేశంలో మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. 

V60e 6.77-అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Vivo V60e ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15, ఫన్‌టచ్ OS 15 పై నడుస్తుంది. 

Motorola Edge 60 Pro

Motorola Edge 60 Proలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్స్, ఆటోఫోకస్, మాక్రో సపోర్ట్‌తో 50 MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో పాటు ఫోన్‌లో 10 మెగాపిక్సెల్ 3X టెలిఫోటో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. 

Motorola Edge 60 Proలో 6.7-అంగుళాల 1.5K pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. Motorola Edge 60 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. ఇది డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

Also Read :  చంపేసింది బాబోయ్.. 10,000mAh బ్యాటరీతో కొత్త మోడల్ సూపరెహే..!

Nothing Phone (3a) Pro

Nothing Phone (3a) Pro అనేది 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తుంది. ఇది అత్యంత సరసమైన ఫోన్‌లలో ఒకటిగా ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. 6x ఇన్-సెన్సార్ జూమ్ కూడా ఉంది. ఇది ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. 

ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC ద్వారా శక్తిని పొందుతుంది. Android 15 ఆధారంగా నథింగ్ OS 3.1పై నడుస్తుంది. 

Vivo T4 Pro 

Vivo T4 Pro లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇందులో అందుబాటులో ఉంది. Vivo T4 Pro స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 5000 నిట్‌ల బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 27,999గా ఉంది. 

Realme 15 Pro

Realme 15 Pro 5Gలో  సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇచ్చే 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లే, 6500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. 

Advertisment
తాజా కథనాలు