iQOO Pad 5e: చంపేసింది బాబోయ్.. 10,000mAh బ్యాటరీతో కొత్త మోడల్ సూపరెహే..!

iQOO కంపెనీ భారీ 10,000mAh బ్యాటరీతో iQOO Pad 5e టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది 12.05 అంగుళాల 2.8K డిస్‌ప్లే, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో వచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.24,700 నుంచి స్టార్ట్ అవుతుంది.

New Update
iQOO Pad 5e price

iQOO Pad 5e price

మీరు కొత్త టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అది కూడా అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు కలిగిన టాబ్లెట్ గురించి వెతికేస్తున్నారా?. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ iQOO తాజాగా తన లైనప్ లో ఉన్న iQOO Pad 5eని విడుదల చేసింది. ఈ టాబ్లెట్ iQOO 15, iQOO వాచ్ GT, iQOO TWS 5 లతో లాంచ్ అయింది. iQOO Pad 5e.. 12.05-అంగుళాల 2.8K డిస్‌ప్లేను కలిగి ఉంది. 10,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం. 

iQOO Pad 5e price

చైనాలో లాంచ్ అయిన iQOO Pad 5e టాబ్లెట్ మూడు వేరియంట్లలో వచ్చింది.

8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 24,700.
8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 28,400.
12 GB RAM + 256 GB వేరియంట్ ధర సుమారు రూ. 31,100.
16 GB RAM + 512 GB వేరియంట్ ధర సుమారు రూ. 37,100 గా ఉంది. 

iQOO ప్యాడ్ 5e మూడు కలర్ లలో లభిస్తుంది. అదే సమయంలో iQOO వాచ్ GT 2 ఫీచర్ల విషయానికొస్తే.. ఇది బ్లూటూత్, eSIM వెర్షన్లుగా వచ్చింది. వీటి ధరలు వరుసగా రూ. 6,200, రూ. 8,700 ధరలకు లభిస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. అలాగే iQOO TWS 5 ధర సుమారు రూ. 4,900గా ఉంది. ఇది రెండు కలర్ లలో లభిస్తుంది. iQOO Pad 5e, iQOO Watch GT 2 సేల్స్ చైనాలో Vivo e-స్టోర్ ద్వారా ప్రారంభమయ్యాయి. 

iQOO Pad 5e specs

iQOO Pad 5e టాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 12.05-అంగుళాల 2.8K LCD స్క్రీన్ (2,800 × 1,968 పిక్సెల్స్), 144 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. స్క్రీన్ DC డిమ్మింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ టాబ్లెట్ అడ్రినో 750 GPUతో ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 5పై నడుస్తుంది. 

iQOO ప్యాడ్ 5e లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. టాబ్లెట్‌లో క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. iQOO Pad 5e  44 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 10,000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు