Asha Workers: ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా..!
ఆశా వర్కర్లకు ఏపీ కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.