/rtv/media/media_files/2025/03/02/Bf7PmfxyYwwl8YsIGyBt.jpg)
AP government good news to ASHA workers
Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవుల మంజూరుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 42,752 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు.
ఎన్నికల హామీలు అమలు..
రాష్ట్రంలో మొత్తం 42,752 మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 37,017, పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆశా వర్కర్ల వేతనాల కోసం ఏటా రూ.420 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే శనివారం ఆరోగ్య శాఖ సమీక్షలో ఎన్నికల హామీ ప్రకారం.. 30 ఏళ్లపాటు పనిచేసిన ఆశాలకు గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల వరకు చెల్లించేందుకు చంద్రబాబు తెలిపారు. దీంతో ఆశాలకు ఆర్థికభరోసా లభించనుంది. ఇక గ్రాట్యుటీ, ప్రసూతి సెలవుల కింద తొలి కాన్పు సమయంలో 3 నెలలు, రెండో కాన్పులో మరో 3 నెలల చొప్పున అధికారికంగా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు.
Also read: రఘురామ కృష్ణంరాజు కేసులో బిగ్ ట్విస్ట్... సునీల్‌నాయక్‌కు నోటీసులు !
గతంలోనూ చంద్రబాబు అవసరమైన ఆశాలకు స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. అర్హతలున్న వర్కర్లకు ANM నియామకాల్లో ప్రాధాన్యత కల్పించారు. రేషన్ కార్డులు, NTR వైద్య సేవ ట్రస్టు కింద ఉచిత వైద్య సదుపాయాలు కల్పించారు. వృద్ధాప్య పింఛనుకు అర్హత కల్పించిన విషయం తెలిసిందే. కాగా ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. కూటి ప్రభుత్వం ప్రజల పక్షాణ నిలుస్తుందన్నారు.
Also read: Passport Rules: పాస్‌పోర్ట్ రూల్స్ మారినయ్.. కొత్త నిబంధనలు ఇవే!