ap:ధరల భారం తగ్గించేందుకు రెడీ అయిన ఏపీ సర్కార్‌!

ప్రజలపై నిత్యావసరాల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టింది. పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంగ, టమాటా ధరలను స్థిరంగా ఉంచేందుకు రెడీ అయ్యింది.

New Update
CBNN

ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయల ధరల స్థిరీకరణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్పష్టం చేశారు. సామాన్యులపై కూరగాయల ధర భారం పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు భారీగా పడిపోవడం, పెరిగే కూరగాయల ధరలపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు సీఎస్ స్పష్టం చేశారు. ఏపీలో వంగ, టమాటా, పచ్చి మిర్చి, ఎండు మిర్చి తో పాటు వివిధ రకాల కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎస్ విజయానంద్‌ తెలిపారు. అదే సమయంలో రైతుల మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

Also Read: TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్‌ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు!

రాష్ట్రంలో కూరగాయలు, ఇతర పంటల ధరల పర్యవేక్షణపై శనివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎస్ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలు, మార్క్‌ఫెడ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. అటు రైతులకు మద్దతు ధర దక్కడంతో పాటు.. ఇటు వినియోగదారులకు కూడా ధరలు అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. కూరగాయల ధరల్లో హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేయాలని పేర్కొన్నారు. అగ్రివాచ్‌తో పాటు రియల్‌ టైం గవర్నెన్స్‌తో అనుసంధానించి ధరలను ఎప్పటకప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

Also Read: Elon musk: కుమారుడికి భారత శాస్త్రవేత్త పేరు పెట్టిన ప్రపంచ కుబేరుడు మస్క్‌!

రైతులకు కనీస మద్దతు ధర...

అదే సమయంలో రైతులు గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందన్న భరోసా వారిలో కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా యూకలిప్టస్, సుబాబుల్‌ వంటి పంటలు పడించిన రైతులకు కనీస మద్దతు ధర లభించేలా ఐటీసీ సహా వివిధ కంపెనీలతో చర్చలు జరపాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌కు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం టన్ను సుబాబుల్‌ పంటకు రూ.5400.. యూకలిప్టస్‌కు రూ.4400 వరకు కనీస మద్దతు ధర లభిస్తోందని అధికారులు సీఎస్‌కు వివరించారు.

ఇక రైతు బజార్లలో ఏర్పాట్లపైనా అధికారులను సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్జీ కూలర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్‌ వివరించారు. విద్యుత్తు లేకున్నా నీటితో పనిచేసేలా సబ్జీ కూలర్లను ఆధునిక టెక్నాలజీతో తయారు చేసినట్లు తెలిపారు. మార్కెటింగ్‌ శాఖ ఇప్పటికే 59 సబ్జీ కూలర్లకు ఆర్డర్‌ పెట్టిందని.. మరో 112 ఆర్డర్‌ పెట్టి అన్ని రైతుబజార్లలో ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ వెల్లడించారు.

Also Read:Big BReaking: ఢిల్లీ రైల్వే స్టేషన్‌ లో తొక్కిసలాట..15  మంది మృతి..30 మందికి పైగా గాయాలు!

Also Read: Trump: ఓ పక్క బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నా.. డిసీజ్‌డిటెక్టివ్స్ పై వేటు వేసిన ట్రంప్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు