/rtv/media/media_files/2025/02/13/g2vewbM7EQSXWlyIBJgO.jpg)
best cm yogi
ఇండియా టూడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చాలా స్థానాల్లో ఓడిపోయినప్పటికీ 30 రాష్ట్రాలలోని మెజారిటీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా ఓటు వేశారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ 30 రాష్ట్రాలలో 1,36,463 మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించబడింది.
సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 33 శాతం మంది ఆదిత్యనాథ్‌ను ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎన్నుకోగా, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండవ స్థానంలో (13.8%) నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడవ స్థానంలో నిలిచారు, 9.1 శాతం మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేశారు. 4.7 శాతం మంది తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాలుగో స్థానంలో నిలువగా.. ఐదవ ర్యాంకులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారు. అయితే ఎంకే స్టాలిన్, చంద్రబాబు మధ్య కేవలం 0.1 శాతం మాత్రమే తేడా ఉంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ ఎన్నో స్థానంలో ఉన్నారన్నది మాత్రం వెల్లడించలేదు.
తగ్గిన యోగి ప్రజాదరణ
లోక్‌సభ ఎన్నికలకు ముందు నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను పోలిస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ పరంగా 12 శాతం పాయింట్లు భారీగా తగ్గినట్లు కనిపిస్తోంది . అప్పుడు చేసిన సర్వేలో దాదాపు 51 శాతం మంది సీఎం ఆదిత్యనాథ్ పని పట్ల సంతృప్తి చెందారని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 39 శాతానికి పడిపోయింది. 2023ఆగస్టులో చేసిన సర్వేలో దాదాపు 47 శాతం మంది ఆదిత్యనాథ్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ద్వారా సీఎం మమతా బెనర్జీ ప్రజాదరణ 33 శాతం (ఫిబ్రవరి 2024 సర్వే) నుండి 46 శాతానికి (ఆగస్టు2024 సర్వే) పెరిగింది. పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో 29 సీట్లు గెలుచుకుని టీఎంసీ తన పట్టును నిలుపుకోగా.. . 2019లో 18 సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం 11 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.