Roja comments : జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం...రోజా సంచలన ఆరోపణలు

 కూటమి ప్రభుత్వం జనాన్ని నమ్మించి నట్టేట ముంచిందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత రోజా ఆరోపించారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే ,భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృధా చేశార తప్ప, రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదని ఎద్దేవా చేశారు.

New Update
Roja Targets

Roja Targets

 Roja : కూటమి ప్రభుత్వం జనాన్ని నమ్మించి నట్టేట ముంచిందని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత రోజా ఆరోపించారు. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే ,భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృధా చేశార తప్ప, రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఇంకా జగన్‌నే తిడుతున్నారన్నారు. నాకు విజన్ ఉంది విస్తారాకుల కట్టా ఉందన్న చంద్రబాబు...అప్పులు చేస్తూ కూర్చున్నాడని ఆరోపించారు.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

జగన్ చాలా తక్కువ అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించారని,అప్పులు చేసి రాజధానిని ఎందుకు కట్టాలి? కట్టాల్సిన అవసరం ఏముంది ? అని రోజా ప్రశ్నించారు.అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారు. చేసిన అప్పులను తమ ఖాతాల్లోకి కూటమి నేతలు మళ్లించుకుంటున్నారని రోజా  ఆరోపించారు.ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.1500లపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఉచిత బస్సు గురించి లేదని విమర్శించారు.

Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

Also read :  నామినేటెడ్‌ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తల్లి్‌కి వందనంకు నిధులు కేటాయింపు చేయలేదు‌‌‌... అన్నదాతను మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు సున్నా వడ్డీ ఇస్తామని మోసం చేశారు...బడ్జెట్ ను పాజిటివ్ గా ప్రారంభించాల్సింది పోయి నెగిటివ్ గా మంత్రి ప్రారంభించారని రోజా ఆరోపించారు. లక్ష కోట్ల అప్పులు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతోందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని రోజా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చూడండి:Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

Also Read: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు