AP Cabinet : గుడ్ న్యూస్..  35 వేల ఉద్యోగాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌ అదిరిపోయే శుభవార్త!

ఏపీ లెదర్‌ ఫుట్‌వేర్‌ పాలసీ 4.0కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్‌లో ఆమోదం లభించింది.  రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

New Update
ap-cabinet cm chandrababu

ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ కేబినేట్ మీటింగ్ లో ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించి ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా  తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్లు అలాగే  కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

Also Read:ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణులు - టాప్ 5 లిస్ట్ ఇదే!

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకానికి

ఇక 2 వేల 260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకానికి కేబినెట్‌ ఆమోదం  తెలిపింది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.  విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా లీగల్‌ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.  దుకాణాల ద్వారా రేషన్‌, ఇతర సరకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చ జరిగింది.  

11 సంస్థలకు కేబినెట్‌లో ఆమోదం

ఏపీ లెదర్‌ ఫుట్‌వేర్‌ పాలసీ 4.0కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్‌లో ఆమోదం లభించింది.  రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.కేబినేట్ మీటింగ్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. లిక్కర్ స్కామ్ లో  విచారణ పారదర్శకంగా జరుగుతోందని, ఎవరూ కూడా అనవసరంగా మాట్లాడి వివాదాలకు తావివ్వొద్దన్నారు. ఇక ప్రధాని ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.  

Also Read:రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!

Also Read:కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..

ap-cabinet | ap cm chandrababu naidu | ap-jobs | telugu-news 

Advertisment
తాజా కథనాలు