Manchiryal : మంచిర్యాల జిల్లాలో దారుణం. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

 ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తల మధ్య వచ్చి విభేధాల నేపథ్యంలో భర్తను భార్య కత్తితో నరికి చంపింది. భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనతో పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
murder

murder

Manchiryal : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యభర్తల మధ్య వచ్చి విభేధాల నేపథ్యంలో భర్తను భార్య కత్తితో నరికి చంపింది. భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణం శాంతి నగర్‌‌కు చెందిన మోయిన్, అవంతిలు కొంతకాలం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ప్రేమ వివాహం చేసుకున్న వీరు పెళ్లయిన కొత్తలో భాగానే ఉన్నారు. ఇన్నాళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో కొద్దిరోజులుగా కలహాలు మొదలయ్యాయి.
 
ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చిన్నగా మొదలైన వివాదం ముదరి పెద్దదవ్వడంతో ఆవేశానికి లోనైన అవంతి, ఇంట్లోని కత్తితో భర్త మోయిన్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మోయిన్‌కు తీవ్ర రక్తస్రావమైంది.  మోయిన్‌ను గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమించడంతో మోయిన్ అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు, భర్త వేధింపులే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మోయిన్, అవంతిది ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ మోయిన్ తరచూ తనను వేధించేవాడని, ఆ బాధ భరించలేకే భార్య అవంతి ఘాతుకానికి పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితురాలు అవంతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు