Ap-Telangana: బీ అలర్ట్...7 రోజులపాటు వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
ఏపీలోవాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది