/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) ఓ నివేదిక రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. జూలై 1వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని.. అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ.. దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని పేర్కొంది.
Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు
Telangana Rains
ఇందులో భాగంగానే ఇవాళ (జూన్ 29)న పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అందులో ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Also Read: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్ మస్క్ కీలక సూచన
అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఇవాళ మాత్రమే కాకుండా రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉంది.
Also Read: కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, మెదక్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
Also Read : జపాన్‌లో ‘ట్విటర్ కిల్లర్’ కు ఉరి
Follow Us