UN Meeting:నీ మాటలు ఎవడు వింటాడు..ఐరాసలో నెతన్యాహు స్పీచ్ కు అవమానం
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
హెచ్1 బీ వీసా ఫీజుల పెంపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరాస వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు.
నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. అవన్నీ యాదృచ్చికంగా జరిగినవి కాదని..కావాలనే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. చేదు ఘటనలపై దర్యాప్తుకు ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ యార్క్ లో ఐరాస కార్యాలయానికి ట్రంప్ వస్తున్న సందర్భంగా అక్కడ ట్రాపిక్ ఆపేశారు. ఇందులో మెక్రాన్ చిక్కుకుపోయారు.
ఐక్యరాజ్యసమితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంపం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాధినేతల సమక్షంలో విరుచకుపడ్డారు. తాను పలు యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నా తనకు సహకరించలేదని విమర్శించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి ఐక్యరాజ్యసమితిలో ఓ చరిత్రాత్మక తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించడాన్ని బలపరిచే ఈ తీర్మానం ‘న్యూయార్క్ డిక్లరేషన్’ పేరుతో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.
టైమ్ దొరికితే చాలు భారత్ మీద పడి ఏడుస్తుంటుంది పాకిస్తాన్. ఐక్యరాజ్య సమతిలో మళ్ళీ అదే చేయాలనుకుంది కానీ భారత్ చేతిలో చావు దెబ్బలు తింది. పాకిస్తాన్ అప్పుడు అడుక్కోవడంతో బిజీగా ఉందంటూ భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాక్ నోరు మూయించారు.
ఇరాన్ లో అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ ఉన్న ఒక్కో రియాక్టర్ మీదనా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తోంది. అయితే బుషెహర్ రియాక్టర్ మీద మాత్రం దాడి చేయొద్దని చెబుతోంది ఐక్య రాజ్య సమితి.