TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్ పది నుంచి మూడు రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది.
ఏప్రిల్ పది నుంచి మూడు రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది.
శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
తిరుమల స్వామివారిని దర్శించుకునే విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
సామాన్య భక్తులకు వేసవిలో ఇబ్బంది ఉండకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రేక్ దర్శనాలను కుదించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేక్ దర్శనం సమయాన్ని తగ్గించడం లేదా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇదే జరిగితే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు.
తిరుమల దేవస్థానం గోపురం పైనుంచి గురువారం విమానం ప్రయాణించింది. ఆగమన శాస్త్ర నిబంధన ప్రకారం గుడిపై నుంచి విమాన రాకపోకలు నిషేదం. దీంతో టీటీడీ వేద పండితులు, భక్తులు విమానయాన శాఖపై మండిపడుతున్నారు. గతంలోనే ఇలా మరోసారి జరగొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించారు. మొత్తం రూ.772 కోట్లతో 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు పాలకమండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు.