/rtv/media/media_files/2025/04/12/7BpPtuyOn6JHSsBigmOn.jpg)
ttdslippers
TTD:తిరుమలలో అపచారం జరిగింది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు వచ్చేసినప్పటికీ గుర్తించకుండా సిబ్బంది నిద్రపోతున్నట్లున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి పాదరక్షలు ధరించారు. మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన తర్వాత కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించలేదు.. భద్రత అధికారులు విఫలం అయ్యారు. ముగ్గరు భక్తులు పాదరక్షలు ధరించినట్లు తిరుమల శ్రీవారి ఆలయ మహా ద్వారం దగ్గర గుర్తించారు. వెంటనే పాదరక్షల్ని పక్కన విడిచి ఆలయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
Also Read: MLC Vijayasanthi: బజారుకీడ్చి అతి దారుణంగా చంపేస్తా..విజయశాంతి దంపతులకు బెదిరింపులు!
పవిత్ర ఆలయంలోకి భక్తులు తెలిసో తెలియకో చెప్పులు వేసుకుని వెళుతున్నా, అడ్డుకోలేని అధికార యంత్రాంగం టీటీడీలో ఉంది. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. @TTDevasthanams లో తనిఖీ ఎంత అధ్వానంగా వుందో ఇదే నిదర్శనం. టీటీడీ ఆలయంలోకి ప్రమాదకర వస్తువుల్ని… pic.twitter.com/iArERC3tGk
— Maddila Gurumoorthy (@GuruMYSRCP) April 12, 2025
ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తీరుపై భక్తులు మండిపడుతున్నారు. భక్తులు ఆలయంలోకి చెప్పులతో వస్తే సిబ్బంది ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు వినపడుతున్నాయి.తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొబైల్స్, నిషేధిత వస్తువులతో పాటు పాదరక్షలు కూడా లోపలికి తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత భద్రతా సిబ్బందినే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు రావడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: West Bengal: బెంగాల్‌లో చెలరేగిన హింస.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం
సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా వెళ్లాలి. అక్కడ భద్రతా సిబ్బంది భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఒకవేళ మొబైల్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే వాటిని అక్కడే తీసుకుంటారు. ఆ తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కానీ తనిఖీల సమయంలో ఈ పాదరక్షల్ని గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
మహాద్వారం దగ్గర ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. దాంతో భక్తులు అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి వెళ్లారు.
Also Read: America -Trump: ట్రంప్ ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్!
Also Read: Telangana: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం!
tirumala | slippers | devotees | latest-news | telugu-news