TTD Income : చంద్రబాబు బర్త్ డే...టీటీడీకి విరాళాల వెల్లువ..ఎంతంటే ?

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భాష్యం విద్యాసంస్థలు రూ.44 లక్షలు విరాళంగా అందించాయి. ఈ విరాళంతో ఆదివారం అన్న ప్రసాద వితరణ జరుగుతోంది.

New Update
TTD Income

TTD Income

TTD Income : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ర్ట విభజన తర్వాత ఏపీకి రెండవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఇది తొలిఏడాదిలో తొలి బర్త్ డే. అందులోనూ 75 ఏండ్ల నిండడంతో ఆ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!

ఈ క్రమంలోనే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు భాష్యం విద్యాసంస్థలు రూ.44 లక్షలు విరాళంగా అందించాయి. వకుళామాత అన్న ప్రసాద కేంద్రంలో భాష్యం విద్యాసంస్థల ప్రతినిధులు టీటీడీ అధికారులకు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ విరాళంతో ఆదివారం అన్న ప్రసాద వితరణ జరుగుతోంది.

Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!

మరోవైపు బెంగుళూరుకు చెందిన ఓ భక్తుడు కూడా టీటీడీకి భారీ విరాళం అందించారు. బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి.. దాత తరఫున విరాళం అందించారు. విరాళానికి సంబంధించిన డీడీని శనివారం రోజున టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి అందజేశారు.

Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!

కాగా తిరుమల శ్రీవారి ఆదాయం.. అంతకంతకూ పెరుగుతోంది.ఏటేటా శ్రీవారి ఆదాయం పెరుగుతూ పోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్‌నూ పెంచేస్తోంది. ఇటు హుండీ, అటు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూపంలో ఏడుకొండవారి ఆస్తుల విలువ కొండంత అవుతోంది. గత ఏడాది వార్షిక ఆదాయంలో హుండీనే ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ప్రతి నెలా రూ.100 కోట్ల పైమాటే గా ఉన్న హుండీ ఆదాయం వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హుండీ ద్వారానే టీటీడీ కి వచ్చిన ఆదాయం రూ. 1,700కోట్లకు పై మాటే. ఈ ఏడాది హుండీ టార్గెట్ రూ.1729 కోట్లుగా ఉంది.
 Also Read:  Ayodhya: అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం
 కోవిడ్ కు ముందు రూ. 900 నుంచి రూ. 1,000 కోట్లలోపే లోపే ఉండే హుండీ ఆదాయం గత నాలుగేళ్లుగా అంతకంతకు పెరుగుతోంది. కోవిడ్ అనంతరం భారీగా పెరిగిన వెంకన్న ఆదాయం క్రమక్రమంగా రెట్టింపు అయింది. 2022-23 బడ్జెట్‌లో హుండీ ద్వారా రూ. వెయ్యి కోట్లు లభిస్తుందని అంచనా వేసిన టీటీడీ ఊహించని విధంగా రూ.1,613 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇక 2023-24 ఏడాదిలో రూ. 1,611 కోట్లు, 2024-25 గాను ఇప్పటిదాకా రూ. 1671 కోట్ల ఆదాయం హుండీ ద్వారా టీటీడీకి లభించింది.

Also Read:Musk-India:-Modi: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్

Also Read: Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు