అమెరికాకు ఆ సేవలు బంద్.. భారత్ సంచలన నిర్ణయం
భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్‌తో పాటు పలు దేశాలు ఇటీవల అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర తపాలాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో ట్రంప్ చనిపోయాడని వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ట్రంప్ చనిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్లో TRUMP IS DEAD హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ మరణ వార్తలపై వైట్ హౌస్ స్పందించింది.
ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదు. కేవలం తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ నుంచే సమాచారాన్ని పంచుకుంటున్నారు.
సరిగ్గా 27 సంవత్సరాల క్రితం, అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో భారత్ పోఖ్రాన్-II అణు పరీక్షలను నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌పై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించారు.
అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇండియాపై టారిఫ్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. అమెరికా చెప్పినట్లు చేస్తే వినాయక చవితి వేళ భారత్‌పై టారిఫ్‌లు తగ్గిస్తామని పీటర్ నవారో ప్రకటించారు.
ట్రంప్ మొదట ఇండియాపై 25శాతం టారిఫ్‌లు విధించాడు. తర్వాత రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాల కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని దాన్ని 50 శాతానికి చేశాడు. ఇది సుమారు $60.2 బిలియన్ల విలువైన భారతీయ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు నిలిచిపోయాయి. ఆగస్టు 27 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. అమెరికాలో ఉన్నవారి కోసం ఇండియా నుంచి పార్సల్స్ పంపుతుంటారు. ఇక నుంచి అలా చేయలేరు.
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ లోపల అమెరికాలో వలసదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. దాదాపు 1.5 మిలియన్లు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా తగ్గడం 1960 తర్వాత ఇదే మొదటిసారని అంటున్నారు.
పుతిన్, జెలెన్ స్కీల సమావేశం ఏర్పాటు చేయడం నూనెలో వెనిగర్ కలపడం లాంటిదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారిద్దరూ కలిసేంతవరకూ తాను దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా ఈ రోజు ఈ కామెంట్స్ చేశారు.