/rtv/media/media_files/2025/10/09/us-diplomat-2025-10-09-10-09-52.jpg)
చైనాలో అమెరికా రాయబారి హనీట్రాప్ కలకలం రేపింది. ఓ యువతితో ప్రేమాయణం నడుపుతున్న అమెరికా దౌత్యవేత్తపై ట్రంప్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. సదరు రాయబారిని పదవి నుంచి తప్పించింది. తొలగించబడిన దౌత్యవేత్త నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, చైనా మహిళతో తాను పెట్టుకున్న రిలేషన్‌షిఫ్ గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంలో విఫలమయ్యారని విదేశాంగ శాఖ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారం జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని భావించిన ట్రంప్ పాలనలోని విదేశాంగ శాఖ, తక్షణమే ఆ దౌత్యవేత్తను పదవి నుంచి తొలగించింది. భద్రతా కారణాల దృష్ట్యా తొలగించబడిన దౌత్యవేత్త పేరును అధికారులు వెల్లడించలేదు.
🇺🇸 Secretary of State Marco Rubio has fired Daniel Choi, a State Department Foreign Service officer who admitted in an undercover video that he had a romantic relationship with a woman linked to the 🇨🇳 CCP.
— Byron Wan (@Byron_Wan) October 9, 2025
“Today, after Presidential review and approval, the Secretary of State… https://t.co/vgpxitalNnpic.twitter.com/qWC9UaVyM1
అమెరికా ప్రభుత్వం తరఫున చైనాలో పనిచేసే తమ సిబ్బందికి గతంలోనే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, సెక్యూరిటీ క్లియరెన్స్ కలిగిన కాంట్రాక్టర్లు ఎవరూ చైనీయులతో శారీరక లేదా ఇతర సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టంగా నిబంధనలు విధించింది. చైనా గూఢచార సంస్థలు తరచుగా "హనీపాట్" వ్యూహాలను ఉపయోగిస్తాయని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలను సహించేది లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే, చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
📷
— TRUMP COUNTRY USA/@LauraLeeBordas (@LauraLeeBordas) October 9, 2025
James O'Keefe@JamesOKeefeIII
BREAKING: Secretary of State Marco Rubio - with President Trump’s approval - FIRES Foreign Service Officer Caught Concealing a Secret Relationship with a CCP Affiliate.
The State Department confirms this marks the first time in history such a… pic.twitter.com/y3grHbBev1