Trump: ట్రంప్‌ ముఖచిత్రంతో డాలర్‌ నాణేం.. వచ్చే ఏడాది విడుదల ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 1 డాలర్‌ నాణేంపై ఆయన ముఖచిత్రాన్ని ముద్రించేందుకు అక్కడి  యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేస్తోంది.

New Update
Trump team defend his appearance on proposed $1 coin despite being in violation of 1866 law

Trump team defend his appearance on proposed $1 coin despite being in violation of 1866 law

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 1 డాలర్‌ నాణేంపై ఆయన ముఖచిత్రాన్ని ముద్రించేందుకు అక్కడి  యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవ సందర్భంగా ట్రంప్‌ ముఖచిత్రంతో ఉన్న ఈ ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి డ్రాఫ్ట్‌ కాయిన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఆ డాలర్‌ నాణేంపై ఓవైపు ట్రంప్‌ ప్రొఫైల్‌ ఉండగా.. మరోవైపు ఆయనపై ఎన్నికలకు ముందు జరిగిన హత్యాయత్నం తర్వాత పిడికిలి బిగించి నిలబడి ఉన్న చిత్రాన్ని ముద్రించారు.  

Also Read: శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. రూ.60 కోట్లు చెల్లించాలని ఆదేశాలు

1866 చట్టం ఏం చెబుతోంది. 

1866 చట్టం ప్రకారం అమెరికా కరెన్సీకి సంబంధించి ఓ నిబంధన ఉంది. దీని ప్రకారం జీవించి ఉన్న అధ్యక్షుడు లేదా ఇతర వ్యక్తలు ముఖచిత్రాలను డాలర్‌ కరెన్సీపై ముద్రించడం నిషేధం. వారు మరణించిన రెండేళ్ల తర్వాతే ముద్రించాలనే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ట్రెజరీ శాఖ మాత్రం ఈ నిషేధం కేవలం కాగితపు కరెన్సీకి మాత్రమే వర్తిస్తుందని.. నాణేలకు కాదని వాదిస్తోంది. ట్రంప్ మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2020లో 'సర్క్యూలేటింగ్ కలెక్టబుల్‌ కాయిన్ రీడిజైన్‌' చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ కొత్త చట్టం వన్‌ డాలర్‌ నాణేలను ప్రత్యేక డిజైన్లలో విడుదల చేసేందుకు ట్రెజరీ శాఖకు అధికారం ఉంటుంది.  ఈ క్రమంలోనే 2026లో రానున్న అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా ట్రంప్‌ ముఖచిత్రంతో ఉన్న నాణేన్ని విడుదల చేసేందుకు ట్రెజరీ శాఖ ప్లాన్ వేస్తోంది. 

Also Read: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి..

అయితే కొత్త చట్ట ప్రకారం కూడా నాణేం వెనుక వైపున మరణించిన లేదా జీవించి ఉన్న ఏ వ్యక్తి  తల, భుజాల చిత్రం ఉండకూడదు. ముఖ్యంగా జీవించి ఉన్న వారి చిత్రం పూర్తిగా నిషేధం. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ చట్టంలో ఉన్న లొసుగును ఉపయోగించింది. ఇటీవల విడుదల చేసిన ముసాయిదా నాణేం ముందుభాగం ట్రంప్‌ ముఖచిత్రాన్ని ముద్రించింది. వెనుక వైపు మాత్రం ట్రంప్ తల, భూజం కాకుండా ఆయన చేయి పైకెత్తి, జెండా ముందు నిలబడి ఉన్న చిత్రం ఉంది. దీంతో ఇది చట్టాన్ని ఉల్లంఘించడం లేదని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు