Trump: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. H1B వీసా రూల్‌తో అమెరికన్ కంపెనీలకు లక్షల కోట్ల భారం

ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్‌ కంపెనీలు హెచ్‌ 1 బీ వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు.

New Update
Trump’s H-1B visa fee to hit US employers with $14bn annual bill

Trump’s H-1B visa fee to hit US employers with $14bn annual bill

ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనివల్ల అమెరికన్ కంపెనీలకే భారీ ఎదురుదెబ్బే తగిలింది. ఆ దేశంలో ఉన్న టెక్‌ కంపెనీలు హెచ్‌ 1 బీ వీసాల కోసం ఏటా 14 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావొచ్చని తెలుస్తోంది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 1.23 లక్షల కోట్లకు పైగానే. ట్రంప్ ప్రభుత్వం H1బీ వీసాపై తీసుకున్న ఈ నిర్ణయం అమెరికన్ కంపెనీలకు పెను భారంగా మారే ప్రమాదం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్‌ ఓ కథనం వెలువరించింది.  

Also Read: తండ్రి వర్ధంతి కోసం భారత్‌ వచ్చిన టెక్కి.. తిరిగి అమెరికా వెళ్లేందుకు రూ.7 లక్షల ఖర్చు

అమెరికాలో తమ దేశస్థులను నియమించుకునేలా కంపెనీలపై ఒత్తిడి చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది చూసుకుంటే 1,41,000 H1 బీ వీసాలు జారీ చేసినట్లు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వీసాలు జారీ చేయాల్సి వస్తే వాటి కోసం ఏకంగా 14 బిలియన్ డాలర్లు (రూ.1.23 లక్షల కోట్లు)గా అంచనా ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read: భయపడకండి.. భారత్‌కు తిరిగి రండి.. H1-B వీసా హోల్డర్లకు నిపుణుడి పిలుపు!

ఈ నిర్ణయం అమెరికన్ స్టార్టప్‌ సంస్థలకు పెద్ద దెబ్బేనని స్టార్టప్‌ ఇంక్యుబేటర్ వై కాంబినేటర్ CEO గారీటాన్ తెలిపారు. విదేశాల్లో టెక్‌ హబ్‌లకు ఇది వరంగా మారిందటూ వ్యాఖ్యానించారు. మరోవైపు H1 బీ వీసా ఫీజుపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసే ఛాన్స్ ఉందని ఓ న్యాయవాది తెలిపారు. వీసా అధికారల పరిధిని దాటి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాదు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు అడ్డుకునే ఛాన్స్ ఉందని కూడా తెలిపారు. 

Also Read: అమెరికా హెచ్ 1బీ వీసాకు పోటీగా చైనా కె వీసా.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

వీసాకు అవసరమైన కనీస వేతనం పెంపు లాంటి విస్తృ-త మార్పులే టార్గెట్‌గా ట్రంప్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొందరు రిపబ్లికన్ చట్ట సభ్యులు లాటరీ విధానంలో కాక.. జీతాల ఆధారంగా ఈ వీసాలు మంజూరు చేయాలంటూ కోరుతున్నారు.  

Advertisment
తాజా కథనాలు