ట్రంప్‌ని పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.. ఎందుకంటే?

ఇజ్రాయిల్ గాజా మధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ నుంచి సానుకూల సంకేతాలు రావడాన్ని భారత ప్రధాని మోదీ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు.

New Update
modi-trump

PM Modi- Trump

ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలకు హమాస్ అంగీకరించింది. తమ ఆదీనంలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. ట్రంప్ ‌20 సూత్రాల ప్రణాళికపై సంతకం చేసేందుకు హమాస్ ఒప్పంకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ నుంచి సానుకూల సంకేతాలు రావడాన్ని భారత ప్రధాని మోదీ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ బందీల విడుదలపై హమాస్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.  ఈ మేరకు మోదీ Xలో ట్రంప్ ప్రయత్నాన్ని అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో ట్రంప్ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

"గాజా సంఘర్షణను ముగించడానికి ట్రంప్ ప్రకటించిన సమగ్ర ప్రణాళికని మేము స్వాగతిస్తున్నాము. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజలకు, అలాగే విస్తృత పశ్చిమాసియా ప్రాంతానికి ఇది దీర్ఘకాలిక, స్థిరమైన శాంతి, భద్రత, అభివృద్ధికి ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తుంది. సంఘర్షణను ముగించి, శాంతిని సురక్షితం చేసే ఈ ప్రయత్నానికి సంబంధిత పక్షాలన్నీ మద్దతు ఇస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి వైట్‌హౌస్‌లో ఈ 20-సూత్రాల శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో ముఖ్యంగా హమాస్ చెరలో ఉన్న మిగిలిన ఇజ్రాయెల్ బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని, ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి దశలవారీగా ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు.

Advertisment
తాజా కథనాలు